RRR Movie: ‘బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ భీమ్’.. వేటాడటానికి సిద్ధంగా ఉన్న భీమ్..

|

Dec 08, 2021 | 2:48 PM

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమానుంచి వచ్చే ఏ చిన్న అప్ డేట్ అయినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది.

RRR Movie: ‘బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ భీమ్.. వేటాడటానికి సిద్ధంగా ఉన్న భీమ్..
Ntr
Follow us on

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమానుంచి వచ్చే ఏ చిన్న అప్ డేట్ అయినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమానుంచి రేపు (9న ) ట్రైలర్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్లు సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఇక కొమురం భీమ్‌గా తారక్, అల్లూరిగా రామ్ చరణ్ ఎలా నటిస్తారో చూడాలని అటు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, ఇటు నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల్లో ఆత్రుత పెంచేందుకు ఆర్ఆర్ఆర్ టీమ్ వరుస అప్డేట్స్ ఇస్తుంది.  ఇప్పటికే తారక్ – చరణ్ ల పోస్టర్స్.. అలియా భట్ – అజయ్ దేవగన్ పాత్రల మేకింగ్ వీడియోలను షేర్ చేశారు మేకర్స్.

ఇప్పటికే ‘బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ రామ్’ అంటూ అల్లూరి సీతారామరాజు వీడియోను తారక్ విడుదల చేశారు. ఈ వీడియోలో చరణ్ పోలీస్ గెటప్ లో  నిప్పుల్లో నడుచుకుంటూ వస్తూ కనిపించాడు. ఈ నేపథ్యంలో తాజాగా తారక్ కు సంబంధించిన వీడియోను ప్రేక్షకులతో పంచుకున్నారు చిత్రయూనిట్. ఈ వీడియోను చరణ్ విడుదల చేశారు. ‘బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ భీమ్’ అనే క్యాప్షన్ ఈ వీడియోను వదిలారు. ఈవీడియోలో ఎన్టీఆర్ బైక్ స్టార్ట్ చేసి రయ్యిమంటూ దూసుకెళ్లడం.. తలవరకు నీటిలో మునిగి దేనినో వేటాడటానికి సిద్ధంగా ఉన్నట్టు చూపించారు. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో 2022 జనవరి 7న ఆర్ఆర్ఆర్ సినిమాను ఘనంగా విడుదల చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lasya Manjunath: అరవిరిసిన లాస్యం గులాబీ పువ్వుల నవ్వుతు ఫోజులిచిన్న యాంకరమ్మ

క్యూట్‏నెస్‏తో కట్టి పడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా ?

Samantha: కష్టపడి కెరీర్ నిర్మించుకున్నాను.. ఇప్పుడు నా కలలన్నీ శిథిలమైపోయాయి.. సమంత ఎమోషనల్