కన్నడనాట ‘కామ్రేడ్‌’కు సెగ.. ‘బాయ్‌కాట్’ చేయాలంటూ ట్వీట్లు

| Edited By:

Jul 27, 2019 | 10:01 AM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా భరత్ కమ్మ తెరకెక్కించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. సినిమాలో విజయ్, రష్మిక మధ్య ప్రేమ చాలా బావుందంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి ఇప్పుడు కన్నడనాట సెగ మొదలైంది. డియర్ కామ్రేడ్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ కర్ణాటకకు చెందిన పలువురు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. […]

కన్నడనాట ‘కామ్రేడ్‌’కు సెగ.. ‘బాయ్‌కాట్’ చేయాలంటూ ట్వీట్లు
Follow us on

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా భరత్ కమ్మ తెరకెక్కించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. సినిమాలో విజయ్, రష్మిక మధ్య ప్రేమ చాలా బావుందంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి ఇప్పుడు కన్నడనాట సెగ మొదలైంది. డియర్ కామ్రేడ్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ కర్ణాటకకు చెందిన పలువురు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ మూవీని దక్షిణాదిన అన్ని భాషల్లో శుక్రవారమే విడుదల చేశారు. అయితే కర్ణాటకలో పలు చోట్ల కన్నడ వెర్షన్‌ కంటే తెలుగు వెర్షన్‌కే ఎక్కువ థియేటర్లను కేటాయించారు. దీంతో కన్నడిగులు కోపాద్రిక్తులవుతున్నారు. కన్నడ వెర్షన్‌కు ఎక్కువ థియేటర్లు ఇవ్వలేకపోతే.. తెలుగు వెర్షన్‌నే ఇక్కడ విడుదల చేయొచ్చు కదా.. మళ్లీ కన్నడలో డబ్ చేయడం ఎందుకంటూ కొంతమంది.. కన్నడిగులపై తెలుగును రుద్దడం ఆపండి అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనికి బాయ్‌కాట్ డియర్ కామ్రేడ్ అంటూ హ్యాష్‌ట్యాగ్ పెడుతూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సమస్యను నిర్మాతలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.