Ram Charan : రామ్ చరణ్- శంకర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో.. కీలక పాత్రలో కనిపించనున్న..

|

Apr 08, 2021 | 4:09 PM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు

Ram Charan : రామ్ చరణ్- శంకర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో.. కీలక పాత్రలో కనిపించనున్న..
Ram Charan
Follow us on

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన చరణ్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. తారక్ ఈ మూవీలో కొమురం భీం గా కనిపించనున్నాడు. ఈసినిమాతోపాటు మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాలో చరణ్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపించనున్నాడు రామ్ చరణ్.

ఇక ఈ రెండు సినిమాల తర్వాత టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు చరణ్. . పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మాతలు దిల్ రాజు – శిరీష్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ రాజకీయ నేపథ్యంలో ఉండనుందని టాక్ కాగా ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్ర ఉన్నదట. ఆపాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోను ఎంపిక చేసేపనిలో ఉన్నారని అంటున్నారు. ఇంతకు ఆ హీరో ఎవరోకాదు కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఈ నేపథ్యంలో శంకర్ – చరణ్ లతో ఉన్న పరిచయాలతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో వైపు సల్మాన్ ఒప్పుకోకపోయినా ఎవరో ఒకరు స్టార్ హీరోతోనే ఆ పాత్రను చేయించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో చరణ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kangana Ranaut : ఆ స్టార్ హీరో నాకు రహస్యంగా కాల్ చేసాడు.. షాకింగ్ విషయం చెప్పిన కంగనా..

Upasana Konidela: సురక్షితంగా ఉన్నామా లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటున్న కొణిదల వారి కోడలు..

Heroine Anjali: వకీల్ సాబ్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో చిత్రయూనిట్ ..