Sai Pallavi: సాయి పల్లవి పాటను కాపీ చేసిన బాలీవుడ్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

సినిమాలే కాదు ఆ సినిమాల్లోని పాటలను వదలడం లేదు బాలీవుడ్ మేకర్స్. ఇప్పటికే మన సినిమాలను అక్కడ రీమేక్  చేసి మంచి విజయాలను అందుకున్నారు.

Sai Pallavi: సాయి పల్లవి పాటను కాపీ చేసిన బాలీవుడ్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
Sai Pallavi

Edited By: Ravi Kiran

Updated on: May 31, 2022 | 7:39 PM

సినిమాలే కాదు ఆ సినిమాల్లోని పాటలను వదలడం లేదు బాలీవుడ్ మేకర్స్. ఇప్పటికే మన సినిమాలను అక్కడ రీమేక్  చేసి మంచి విజయాలను అందుకున్నారు. కబీర్ సింగ్, జెర్సీ సినిమాలు ఇప్పటికే బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అందుకే తాజాగా లవ్‌స్టోరీ సినిమాలోని సారంగదరియా సాంగ్‌ను కూడా హిందీలో రిక్రేయేట్ చేసేసి.. బీ టౌన్‌ను ఫిదా చేసే ప్రయత్నం చేశారు అక్కడి మేకర్స్. కరోనా సెకండ్ వేవ్ తరువాత రిలీజై ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచిన సినిమా లవ్‌స్టోరీ. ఇక ఈసినిమాలోని సారంగ దరియా సాంగ్.. టూ స్టేట్స్‌ను తెగ ఫిదా చేసి యూట్యూబ్‌లో రికార్డ్‌ వ్యూస్‌ ను సాధించింది. సాయి పల్లవి(Sai Pallavi)ఛరిష్మా అండ్ డ్యాన్సింగ్ స్కిల్స్ ఈ పాటను త్రూ అవుట్ ఇండియా పాపులర్ అయ్యేలా కూడా చేసింది. దీంతో ఈ సాంగ్ పై బీటౌన్ మ్యూజిక్ జెయింట్ టీ సిరీస్ కన్ను పడింది.

దీంతో మ్యూజిక్ డైరెక్టర్ మనన్ భరద్వాజ్‌ ఆద్శర్యంలో సారంగ దరియా సాంగ్‌ను ‘జో ముజే దివానా కర్‌దే’ గా హిందీలో రీక్రియేట్ చేసింది. ఇక ఈసాంగ్ ను తులసి కుమార్, మనన్‌ భరద్వాజ్‌లు పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ కూడా యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ను సాధిస్తోంది. అయితే ఈ సాంగ్ విన్న తెలుగు ఆడియన్స్ షాకవుతున్నారు. సారంగదరియా సాంగ్ ను ఇలా చేశారేంట్రా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Ileana: నీ సన్నజాజి సోయగాలను చూసేందుకు నయనాలు చాలవే..ఇలియానా న్యూ లుక్స్ వైరల్..

Vidya Balan: ఉష్..! వయస్సుతో పని ఎం ఉంది..? అందమే మాట్లాడుతుంది.. విద్య బాలన్

Super Star Krishna Birthday: ఐ లవ్ యూ నాన్న.. తండ్రికి విషెష్ చెబుతూ మహేష్ ఎమోషనల్ పోస్ట్..