Ananya Panday: ఆఫర్స్ రాకపోవడంతో.. సంచలన నిర్ణయం తీసుకున్న అనన్య పాండే..

ఫ్లాప్ లు పలకరిస్తే ఆఫర్స్ కూడా కరువైపోతుంటాయి. తాజాగా ఇదే పరిస్థితి ఓ ముద్దుగుమ్మకు వచ్చింది. ఆ అమ్మడు ఎవరో కాదు అనన్య పాండే.

Ananya Panday: ఆఫర్స్ రాకపోవడంతో.. సంచలన నిర్ణయం తీసుకున్న అనన్య పాండే..
Ananya Pandey

Updated on: Dec 11, 2022 | 6:24 AM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా కంటిన్యూ అవ్వడం అంటే అంతా ఈజీ కాదు. స్టార్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చిన ఆ కూడా కొన్ని సార్లు అదృష్టం కలిసి రాదు. ఫ్లాప్ లు పలకరిస్తే ఆఫర్స్ కూడా కరువైపోతుంటాయి. తాజాగా ఇదే పరిస్థితి ఓ ముద్దుగుమ్మకు వచ్చింది. ఆ అమ్మడు ఎవరో కాదు అనన్య పాండే. బాలీవుడ్ బ్యూటీ అన్నాన్యపాండే అక్కడ వరుస సినిమాలు చేస్తూ రాణించింది. కానీ ఈ అమ్మడికి ఈ మధ్య కాలంలో అదృష్టం కలిసి రావడం లేదు. అనన్య ఎన్నో ఆశలు పెట్టుకున్న పాన్ ఇండియా మూవీ లైగర్ దారుణంగా ఫ్లాప్ అయ్యింది. లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది ఈ భామ. కానీ ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అవవడంతో ఈ బ్యూటీకి ఆఫర్లు తగ్గయని తెలుస్తోంది.

దాంతో చేసేదేమి లేక రెమ్యునరేషన్ తగ్గించుకుందట అనన్య. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అనన్య. ఆ తరువాత కొన్ని అవకాశాలు దక్కించుకుంది. ‘గెహ్రాయాన్’ అనే సినిమాతో హిట్ అందుకున్నా.. అది దీపికా పదుకునే ఖాతాలోకి వెళ్ళింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని బాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

అయితే అనన్య ఒకొక్క సినిమాకు 80లక్షల వరకు రెమ్యునరేషన్ అనుదుకుంటుంది. అయితే ప్రస్తుతం మేకర్స్ ఎవ్వరూ ఆమెకు ఛాన్స్ లు ఇవ్వకపోవడంతో.. తన రెమ్యునరేషన్ లో భారీగా కోత విధించిందట. దాదాపు రూ.50 లక్షల వరకు రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా ఈ అమ్మడికి ఛాన్స్ లు వస్తాయేమో చూడాలి.

ఇవి కూడా చదవండి