
నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు సైఫ్ పై కత్తితో దాడి చేశాడు. సైఫ్ ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ దొంగ సైఫ్ ఇంట్లోకి చొరబడి డబ్బు డిమాండ్ చేసి అతని పై దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ వీపుపై తీవ్ర గాయాలు కావడంతో ఆయనను హాస్పటల్ లో చేర్పించారు. ప్రస్తుతం సైఫ్ సేఫ్ గా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా సైఫ్ హాస్పటల్ బిల్లు ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది.
జనవరి 16న సైఫ్ అలీఖాన్ ఆసుపత్రిలో చేరారు. ఇంట్లో కాస్ట్లీ కార్లు ఉన్నా కూడా సైఫ్ ను అతని కుమారుడు ఇబ్రహీం ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత డాక్టర్ సైఫ్ కు ఆపరేషన్ చేశారు. సైఫ్ వెన్ను నుంచి కత్తిని తొలగించారు వైద్యులు.కాగా సైఫ్ అలీఖాన్ ఆసుపత్రి బిల్లు రూ.35.95 లక్షలు అని తెలుస్తుంది. దానిలో బీమా కంపెనీ నుంచి రూ.25 లక్షలు అందినట్లు సమాచారం.
గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో సైఫ్ ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఇంటి పని మనిషి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆమె తిరగబడటంతో గొడవ విని అక్కడికి సైఫ్ అలీఖాన్ వచ్చాడు. దాంతో ఆ దుండగుడు సైఫ్ పై దాడి చేశాడు. సైఫ్‌పై ఆరు సార్లు కత్తితో దాడి చేశాడు. చికిత్స అనంతరం సైఫ్ కోలుకున్నారు. ఇక ఇప్పుడు సైఫ్ హాస్పటల్ బిల్లుకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో బీమా కంపెనీ నుంచి ఒక ప్రకటన ఉంది. సైఫ్ అలీ ఖాన్ ‘నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్’ పొందారు. సైఫ్ హాస్పిటల్ బిల్లు రూ.35.91 లక్షలు. అందులో రూ. 25 లక్షలకు బీమా కంపెనీ ఆమోదం తెలిపినట్లు అందులో ఉంది. దీంతోపాటు జనవరి 21న డిశ్చార్జి కానున్నట్లు కూడా పేర్కొన్నారు. అయితే అది ఆసుపత్రి బిల్లు కాదా అనేది ఖచ్చితంగా తెలియడం లేదు.
Health insurance approval of Saif Ali khan
Immediate response from them coz of Celebrity while common man struggles for it…#SaifAliKhan #SaifAliKhanAttacked #SAIFALIKHANATTACK pic.twitter.com/A0xw46zOcb
— SACHIN TIWARI (@GreatTiwari80) January 17, 2025
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి