
ప్రభాస్ పాన్ ఇండియన్ రేంజ్లో వెలిగిపోతున్న హీరో. ప్రాజెక్ట్ కె కల్కి సినిమాతో కామికాన్ వేదికనెక్కిన హీరో.. ఈ సినిమా వీడియో గ్లింప్స్‌తో హాలీవుడ్లో మీడియాలో హాట్ టాపిక్ అయిన హీరో. అలాంటి మన పాన్ ఇండియన్ స్టార్ హీరోను.. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అవమానించారు. డైరెక్ట్‌గా కాకపోయినా.. ఇండైరెక్ట్‌గా తాగుబోతంటూ.. నోరు పారేసుకున్నారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ నటించడంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
ఎస్ ! కాశ్మీరీ ఫైల్స్ సినిమాతో.. ఆ సినిమా క్రియేట్ చేసిన కాంట్రవర్సీతో.. రాబట్టిన కలెక్షన్స్‌తో.. రీసెంట్ డేస్‌లో విపరీతంగా బజ్ అయిన ఈ డైరెక్టర్.. తాజాగా మరో సారి ప్రభాస్ పై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ఆదిపురుష్ అసలు సినిమానే కాదని.. ప్రభాస్‌కు నటుడే కాదంటూ.. కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన ఈయన.. తాజాగా మరో సారి ఆదిపురుష్‌ను .. టార్గెట్ చేస్తూనే విమర్శలు చేశారు.
పురాణ గాథలకు స్టార్ హీరోలను ఎంచుకుంటే సినిమా రిజెల్ట్ జీరో అని.. భారీ బడ్జెట్తో మేకర్స్ ఆ సినిమా ను వారితో పూర్తి చేసినా.. ఆదిపురుష్ సినిమాకొచ్చిన ఫలితమే రిపీటవుతుందని అగ్నిహోత్రి అన్నారు. ఒక కథ ఐదు వేల సంవత్సరాలుగా కొనసాగుతుందంటే దానికి ఏదో రీజన్ ఉంటుందని.. కాబట్టి ఎవరైనా అలాంటి కథల్లో దేవుడిగా యాక్ట్ చేసినంత మాత్రాన ఆ సినిమా వారిని దేవుళ్లుగా చేయదన్నారు. అంతేకాదు.. ప్రతి రోజూ రాత్రి పీకలదాగా తాగి తెల్లవారి దేవుడిగా కనిపిస్తే.. చూసే ప్రజలు మూర్ఖులు కాదంటూ.. ప్రభాస్ పై ఇండైరెక్ట్ కామెంట్స్ చేస్తూ.. అవమానించారు ఈ వివాదాస్పద డైరెక్టర్.