Rajkummar Rao: పెళ్లి రోజే పండంటి మహాలక్ష్మి జననం.. కూతురికి సాక్షాతూ అమ్మవారి పేరు పెట్టిన హీరో

బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'స్త్రీ 2' సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువయ్యాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన బొల్లా శ్రీకాంత్ బయోపిక్ 'శ్రీకాంత్' లోనూ లీడ్ రోల్ పోషించి అందరి మన్ననలు అందుకున్నాడు.

Rajkummar Rao: పెళ్లి రోజే పండంటి మహాలక్ష్మి జననం.. కూతురికి సాక్షాతూ అమ్మవారి పేరు పెట్టిన హీరో
Rajkummar Rao Family

Updated on: Jan 18, 2026 | 5:26 PM

బాలీవుడ్‌ ప్రేమ జంట రాజ్‌కుమార్‌ రావు – పాత్రలేఖ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందారు. తమ పెళ్లిరోజు నాడే (నవంబర్‌ 15న) పాత్రలేఖ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఈ సెలబ్రిటీ కపుల్ ఆనందంలో మునిగిపోయారు. తాజాగా తమ కూతురిని అందరికీ పరిచయం చేశారు రాజ్ కుమార్ రావు దంపతులు. చిన్నారి చేతి ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి.. పాపకు ‘పార్వతి పాల్‌ రావు’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. అంటే సాక్షాత్తూ అమ్మవారి పేరునే కూతురికి పెట్టుకున్నారన్నమాట​! ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రాజ్ కుమార్ రావు దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పాప పేరు చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా రాజ్‌ కుమార్‌ రావు, పాత్రలేఖ లది ప్రేమ వివాహం. బాలీవుడ్ లో వీరిద్దరికి మంచి నటులుగా గుర్తింపు ఉంది. 2014లో సిటీలైట్స్‌ సినిమా షూటింగ్‌లో రాజ్ కుమార్ రావు- పాత్రలేఖ ప్రేమలో పడ్డారు. అలా సుమారు ఏడేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన వీరు పెద్దల అనుమతితో 2021 నవంబర్ 15న పెళ్లి పీటలెక్కారు. తమ పండంటి కాపురానికి ప్రతీకగా గతేడాది ప్రారంభంలో గర్భం దాల్చింది పత్రలేఖ. ఆ తర్వాత నవంబర్ 15న పండంటి మహాలక్ష్మి వీరి ఇంట్లోకి అడుగు పెట్టింది.

రాజ్ కుమార్ రావు సినిమా కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్ లో ఉన్న ట్యాలెంటెడ్ నటుల్లో ఇతను కూడా ఒకడు. 2010లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతను పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. రణ్‌, లవ్‌ సెక్స్‌ ఔర్‌ ఢోకా, గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌ 2, స్త్రీ. తలాష్‌, లవ్‌ సోనియా, హిట్‌, శ్రీకాంత్‌, భేడియా, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి, స్త్రీ 2 తదితర సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా, సహాయక నటుడిగా మెప్పించాడు. ముఖ్యంగా ఇతను ప్రధాన పాత్రలో నటించిన స్త్రీ 2 సినిమా ఏకంగా రూ. 900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తుడి చేసింది.

ఇవి కూడా చదవండి

రాజ్ కుమార్ రావు ఎమోషనల్ పోస్ట్..

ఇక పెళ్లికి ముందు పలు సినిమాల్లో నటించింది పాత్ర లేఖ. లవ్‌ గేమ్స్‌, నానూకీ జాను, బద్నాం గాలి, పూలె తదితర సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి.

భార్యతో రాజ్ కుమార్ రావు..