
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్స్ ఈనెల 12న లాస్ ఏంజెల్స్ లో జరగనుంది. ఈ అవార్డ్స్ పై ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్ అంతా ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ సారి ఆస్కార్ లో ఆర్ఆర్ఆర్ నామినేట్ అయిన విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సంచలన విజయం సాధించింది. కాగా ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకొని ఆస్కార్ అవార్డులకు షార్ట్ లిస్ట్ అయింది. ఇక నాటు నాటు సాంగ్ కు అవార్డు వస్తుందని ఇండియన్స్ అందరూ కోరుకుంటున్నారు.
కాగా ఈ అవర్స్ ఫంక్షన్ లో చాలా విశేషాలు ఉండనున్నాయి. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఈ అవార్డ్స్ ప్రెజెంటర్ గా వ్యవహరించనుంది. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదిక తెలిపింది దీపికా.
ఇండియా నుంచి దీపికా పదుకొణెకు మాత్రమే ఈ అవకాశం దక్కిందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిష్ఠాత్మక కాన్స్ 2022లో జ్యూరీలో కూడా ఎంపిక అయ్యింది దీపిక. ఇప్పుడు ఆస్కార్ 2023లో ప్రెజెంటర్ గా వ్యవహరించనుంది.
WTF DEEPIKA PADUKONE TO PRESENT AT THE 2023 OSCARS!!!!!! pic.twitter.com/jf0gGDe9Xp
— pathaani ?️ (@dpobsessed) March 2, 2023