
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఈ మధ్య కాలంలో వార్తల్లో ఎక్కువాగా నిలుస్తుంది. సోషల్ మీడియాలో కూడా సన్నీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ.. స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తూ బాలీవుడ్‌లో సన్నీలియోన్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ అమ్మడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్యకాలంలో సన్నీ సినిమాలు తగ్గించింది. తాజాగా మరోసారి సన్నీ లియోన్ పేరు బీటౌన్ లో ఎక్కువగా వినిపిస్తుంది. పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్ గా మారిన సన్నీ తన నటనతో, అందంతో ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులోనూ ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించింది అలాగే స్పెషల్ సాంగ్స్ లో కూడా మెరిసింది. మొన్నామధ్య మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమాలో కీలక పాత్రలో నటించింది.
తాజాగా సన్నీ బిజినెస్ ప్రారంభించింది. తాజాగా ఈ అమ్మడు కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని సన్నీ స్వయంగా తెలియజేసింది. నటి తన రెస్టారెంట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఢిల్లీలోని నోయిడాలో సన్నీలియోన్ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. సన్నీలియోన్ తన భర్తతో కలిసి ప్రారంభించిన రెస్టారెంట్ పేరు ‘చికలోక’. ఈ విషయాన్నీ సన్నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొత్త వ్యాపారం ప్రారంభించిన తర్వాత సన్నీ మాట్లాడుతూ.. ‘నేను రెస్టారెంట్ ప్రారంభించడమే కాకుండా, ఇతర విషయాలపై కూడా పని చేయాలనుకుంటున్నాను. ఆర్టిస్టులు టీవీ ప్రపంచానికి లేదా సినిమాలకే పరిమితం కాకుండా ఇతర విషయాల గురించి కూడా ఆలోచించాలి.. మన స్వంత బ్రాండ్‌ను మనం విస్తరించుకోగలగాలి…’ అని సన్నీచెప్పుకొచ్చింది. సన్నీ లియోన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో సన్నీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ అభిమానులతో టచ్‌లో ఉండటానికి ఎప్పుడూ తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి