మాస్ మాహారాజా రవితేజ (Raviteja) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇటీవల రవితేజ, డైరెక్టర్ రమేశ్ వర్మ కాంబోలో వచ్చిన ఖిలాడీ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన తదుపరి సినిమాల విషయంలో అచి తూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ.. దమాకా చిత్రాల్లో నటిస్తోన్న రవితేజ.. డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో మాస్ మాహారాజా నటిస్తోన్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా లెవల్లో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో హీరోయిన్ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
ఈ సినిమాలో రవితేజ సరసన నటించే నటిని మేకర్స్ ఖరారు చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ నటి నూపూర్ సనన్ ను ఎంపికచేశారు.. మంచి విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన సోదరి కృతి సనన్ నే ఓ రోల్ మోడల్‌గా తీసుకుంది. అయినా ఆమె చిత్రరంగంలోకి ప్రవేశించడానికి ముందు అనేక అడ్డంకులు ఎదుర్కొంది. ఈమె ఇప్పుడు తెలుగులో టైగర్ నాగేశ్వరరావు తో అరంగేట్రం చేస్తోంది. గతంలో అక్షయ్ కుమార్ తో కలిసి మ్యూజిక్ వీడియోలో కనిపించిన నూపూర్ కి రవితేజతో చేస్తున్న మొదటి చిత్రం కావడం విశేషం.
మాస్ మహారాజా రవితేజ మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు టైటిల్ పోస్టర్ తో ఆసక్తిని సృష్టించింది. విమర్శకుల ప్రశంసలు పొందిన, కమర్షియల్ బ్లాక్ బస్టర్ చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ ను రూపొందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌కు చెందిన అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం రవితేజ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో భారీ స్థాయిలో నిర్మించబడుతుంది. ఇది నిర్మాత కు అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్., తేజ్ నారాయణ్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
మాదాపూర్‌లోని నోవాటెల్ లో (హెచ్ ఐ సి సి)లో టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని ఉగాది రోజున (ఏప్రిల్ 2వ తేదీ) ప్రారంభించనున్నారు. అదే రోజు సినిమా ప్రీ లుక్‌ని కూడా విడుదల చేయనున్నారు. పవర్ ఫుల్ స్క్రిప్ట్ అందించిన వంశీ, ఈ సినిమాలో రవితేజను పూర్తిగా మాస్ లుక్ లో చూపించబోతున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందనుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఆర్ మదీ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.
Happy to announce that @NupurSanon would be joining @RaviTeja_offl for the Massive Hunt in #TigerNageswaraRao ?@DirVamsee @abhishekofficl @gvprakash @madhie1 @kollaavinash @SrikanthVissa @MayankOfficl @UrsVamsiShekar @TNRTheFilm pic.twitter.com/Fc8m5TuDaG
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) March 31, 2022
Also Read: Ram Charan: జక్కన్న సినిమా ఇచ్చిన ఊపుతో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న మెగాపవర్ స్టార్
Jana Gana Mana: ఇండియన్స్ ఆర్ టైగర్స్.. ఇండియన్స్ ఆర్ ఫైటర్స్.. ఆకట్టుకుంటున్న ‘జన గణ మన’ వీడియో
RRR Movie: నేపాల్‌లో ఆర్‌ఆర్‌ఆర్ ఫీవర్.. స్ర్కీన్ ముందు ఫ్యాన్స్ ఎలా ఊగిపోతున్నారో మీరే చూడండి..
RRR movie : కొససాగుతున్న వసూళ్ల వేట.. ఆరు రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ ఎంత వసూల్ చేసిందంటే..