Tollywood: బాబోయ్.. జిమ్‏లో తెగ కష్టపడుతున్న హీరోయిన్.. 44 ఏళ్ల వయసులో..

సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరలవుతుంటాయి. ఇటీవల కాలంలో హీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్, మోడ్రన్ లుక్స్, త్రోబ్యాక్ పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఓ సీనియర్ హీరోయిన్ జిమ్ వర్కవుట్ వీడియోస్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..

Tollywood: బాబోయ్.. జిమ్‏లో తెగ కష్టపడుతున్న హీరోయిన్.. 44 ఏళ్ల వయసులో..
Actress

Edited By: Ravi Kiran

Updated on: Feb 21, 2025 | 2:45 PM

సినీరంగంలో ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. హిందీలో అనేక చిత్రాల్లో నటించి సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఈ అందాల తార.. ఇప్పుడు 44 ఏళ్ల వయసులో జిమ్ లో చెమటలు చిందిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అలాగే ఆమె భర్త సైతం ఇండస్ట్రీలో తోపు హీరో. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఆమె జిమ్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ కరీనా కపూర్. ఈ బ్యూటీకి ఫిట్నెస్ పై ఎంత ఆసక్తి ఉందో చెప్పక్కర్లేదు.

ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ మహేశ్ ఇన్ స్టాలో కరీనా వర్కౌట్ వీడియో షేర్ చేయగా.. అది కాస్త నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో కఠినమైన వర్కవుట్స్ చేస్తూ కరీనా ఎంతో కష్టపడుతుంది. దీనిని బట్టి చూస్తే ఆమె ఫిట్నెస్ పై ఎంత శ్రద్ధ తీసుకుంటుందో అర్థమవుతుంది. ఆరోగ్యం, అందం కోసం ఆమె కఠినమైన వ్యాయామాలు చేయడానికి కూడా వెనుకాడదు అనేది తెలుస్తోంది. ఆ వీడియోలో కరీనా ఓ ప్రొఫెషనల్ లా వెయిట్ లిఫ్ట్ చేయడం.. కార్డియో వ్యాయమం చేయడం.. ప్రతి మూవ్ కి పూర్తి ఎనర్జీ ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

కరీనా కపూర్.. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, షాహిద్ కపూర్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో నటించింది. బీటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కరీనా.. ఆ తర్వాత కొన్నాళ్లకే ఇండస్ట్రీకి దూరమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరీనా సినిమాలకు దూరంగా ఉండగా.. ఆమె భర్త సైఫ్ మాత్రం తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన