Tollywood: బొద్దుగా ఉన్నా ముద్దుగానే! అమ్మయ్యాక గుర్తు పట్టకుండా మారిపోయిన ప్రముఖ హీరోయిన్.. వీడియో వైరల్

అమ్మయ్యాక ఏ అమ్మాయైనా బరువు పెరగడం సర్వసాధారణం. హర్మోన్ల అసమతుల్యత ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. అలాగే పిల్లల ఆలనాపాలనలో పడి చాలామంది తమ శరీరం గురించి పట్టించుకోరు. ఫలితంగా విపరీతంగా బరువు పెరిగిపోతుంటారు. పై ఫొటోలో ఉన్న ప్రముఖ హీరోయిన్ ది కూడా అదే పరిస్థితి.

Tollywood: బొద్దుగా ఉన్నా ముద్దుగానే! అమ్మయ్యాక గుర్తు పట్టకుండా మారిపోయిన ప్రముఖ హీరోయిన్.. వీడియో వైరల్
Tollywood Actress

Updated on: May 24, 2025 | 4:22 PM

పై ఫొటోలో ఉన్న దెవరో గుర్తు పట్టారా? ఒకప్పుడు ఆమె ప్రముఖ హీరోయిన్. తన అందం, అభినయంతో సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే గత కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. తల్లిగా ప్రమోషన్ పొందడంతో తన బిడ్డే ప్రపంచంగా జీవిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తరచూ తన కూతురితో ఉన్న ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ హీరోయిన్ కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఆమె చాలా బొద్దుగా గుర్తుపట్టలేకుండా మారిపోయింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు ఒకప్పటి బాలీవుడ్ అందాల రాణి బిపాసా బసు.

బిపాసా బసు తల్లి గా ప్రమోషన్ పొంది సుమారు మూడేళ్లు గడిచాయి. ఈ మధ్యకాలంలో ఆమె ఎప్పుడూ బయట కనిపించిన దాఖలాలు లేవు. అయితే ఇటీవల ముంబైలో ఒక సామాన్యురాలిగా కనిపించింది బిపాసా. ఎలాంటి మేకప్ లేకుండా సింపుల్ గా దర్శనమిచ్చింది. ఈ మేరకు బిపాసాకు సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట వైరలవుతోంది. ఈ క్లిప్‌లో, బిపాసా నల్లటి లెగ్గింగ్స్, నీలిరంగు టీ-షర్ట్, జిమ్ బ్యాగ్ ధరించి కారు వైపు వేగంగా నడుచుకుంటూ వెళ్లడం మనం చూడవచ్చు. అయితే ఆమెను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు సైజ్ జీరోతో కనిపించిన బిపాసా ఇప్పుడు ఇలా బొద్దుగా మారిపోయిందేంటి? అని ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే తల్లయ్యాక ఇలా బరువు పెరగడం సహజమేనని, ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయమేమిలేదంటున్నారు చాలామంది. అలాగే బరువు విషయాన్ని సాకుగా చూపి మహిళలను ఎగతాళి చేయకూడదని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న బిపాసా బసు వీడియో..

 భర్త, కూతురితో బిపాసా బసు.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.