Actor : కోట్ల ఆస్తులు.. లగ్జరీ ఇల్లు వదిలేసి పల్లెటూరిలో ఉంటున్న స్టార్ హీరో.. కారణం తెలిసి ఆశ్చర్యపోతున్న జనాలు..

భారతీయ సినిమా ప్రపంచంలో అగ్ర కథానాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. వందలాది చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు. కోట్ల ఆస్తులు, సంపాదన ఉన్నప్పటికీ ప్రస్తుతం హడావిడి ప్రపంచానికి దూరంగా పల్లెటూరిలో ఉంటున్నాడు. ఇంతకీ అతడు ఎవరు.. ? ఎందుకు గ్రామంలో ఉంటున్నాడో తెలుసుకుందామా.

Actor : కోట్ల ఆస్తులు.. లగ్జరీ ఇల్లు వదిలేసి పల్లెటూరిలో ఉంటున్న స్టార్ హీరో.. కారణం తెలిసి ఆశ్చర్యపోతున్న జనాలు..
Nana Patekar

Updated on: Feb 24, 2026 | 10:18 AM

బాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు నానా పటేకర్. 1978లో ‘గమన్’ సినిమాతో అరంగేట్రం చేసిన నానా పటేకర్ దాదాపు 4 దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు వందలాది చిత్రాల్లో నటించి మెప్పించారు. నానాకు దాదాపు 10 మిలియన్ డాలర్ల (72 కోట్లు) విలువైన ఆస్తి ఉంది. అతని ఫామ్‌హౌస్, కార్లు, ఇతర ఆస్తులు ఉన్నాయి. అయినప్పటికీ, నానా సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడతాడు. అతడికి పూణే సమీపంలోని ఖడక్వాస్లాలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఒక అద్భుతమైన ఫామ్ హౌస్ ఉంది. అక్కడే నానా పటేకర్ తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. ముంబై నగరానికి దూరంగా ప్రశాంతమైన పల్లెటూరిలో నివసిస్తున్నాడు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

దర్శకుడు సంగీత్ శివన్ 2008లో తీసిన ‘ఏక్: ది పవర్ ఆఫ్ వన్’ కూడా నానా ఫామ్ హౌస్ లోనే తెరకెక్కించారు. అలాగే తన ఇంటి దగ్గర ధాన్యాలు, గోధుమలు, ఆకుకూరలు పండిస్తూ రైతుగా జీవిస్తున్నాడు. ఫామ్ హౌస్ లో 7 గదులు, ఒక పెద్ద హాలు ఉన్నాయి. ఇందులో కేవలం చెక్క ఫర్నిచర్, టెర్రకోట అంతస్తులు ఉన్నాయి. తన అవసరాలకు అనుగుణంగా తన ఇంటిని అలంకరించాడు. ఇంటి చుట్టూ ఎన్నో చెట్లు, మొక్కలు నాటారు. అలాగే గేదెలు, ఆవులు సైతం ఉన్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

నానా పటేకర్ వద్ద రూ.81 లక్షల విలువైన ఆడి క్యూ7 కారు ఉంది. దీనితో పాటు రూ.10 లక్షల విలువైన మహీంద్రా స్కార్పియో , రూ.1.5 లక్షల విలువైన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కూడా ఉన్నాయి. ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతున్నాడు. మూవీ షూటింగ్ కోసం ముంబై వచ్చే నానా.. వెంటనే తన గ్రామానికి వెళ్లిపోతాడు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

Nana Patekar Movies

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Follow Us