SS Rajamouli: దర్శకధీరుని సింప్లిసిటీకి ఫిదా అయిన బాలీవుడ్‌ దిగ్గజ నటుడు.. వీడియోను షేర్ చేస్తూ..

|

Aug 05, 2022 | 11:57 AM

SS Rajamouli-Anupam Kher: బాహుబలి సిరీస్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలతో పాన్‌ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయారు ఎస్‌ఎస్‌ రాజమౌళి (Anupam Kher). ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో దేశవ్యాప్తంగా తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు దర్శక ధీరుడు

SS Rajamouli: దర్శకధీరుని సింప్లిసిటీకి ఫిదా అయిన బాలీవుడ్‌ దిగ్గజ నటుడు.. వీడియోను షేర్ చేస్తూ..
Ss Rajamouli Anupam Kher
Follow us on

SS Rajamouli-Anupam Kher: బాహుబలి సిరీస్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలతో పాన్‌ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయారు ఎస్‌ఎస్‌ రాజమౌళి (Anupam Kher). ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో దేశవ్యాప్తంగా తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు దర్శక ధీరుడు. ఈక్రమంలో పలువురు బాలీవుడ్‌ హీరోలు, నిర్మాతలు, టెక్నీషియన్లు ఆయనతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక హిందీ సినిమాలు చూసేవారికి నటుడు అనుపమ్‌ఖేర్‌ (Anupam Kher) గురించి చెప్పక్కర్లేదు. నాటి దిల్‌వాలే దుల్హనియా నుంచి నేటి కశ్మీర్‌ ఫైల్స్‌ వరకు ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారాయన. ఇలా వేర్వేరు ఇండస్ట్రీల్లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ సినీ దిగ్గజాలు ఒకేచోట కలిశారు. అనుపమ్‌ ఖేర్‌ తాజాగా హైదరాబాద్‌లోని రాజమౌళి నివాసానికి వచ్చారు. వారి ఆతిథ్యాన్ని మనసారా స్వీకరించారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా రాజమౌళిని శాలువాతో ఘనంగా సత్కరించారు అనుపమ్‌ ఖేర్‌. ‘ప్రియమైన రమా గారు, యస్‌యస్. రాజమౌళి. మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ సొంత ఇంటిలో మీకు శాలువాతో స్వాగతం పలకడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీ వినయ, విధేయతలు నాకు బాగా నచ్చాయి. మీ ఇద్దరి నుంచి నేను ఎంతగానో నేర్చుకోవాల్సి ఉంది’ అని అనుపమ్ ఖేర్ పేర్కొన్నాడు. కాగా బాలీవుడ్‌తో పాటు ఇప్పుడు తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు అనుపమ్‌. ఆయన కీలక పాత్ర పోషించిన నిఖిల్‌ కార్తికేయ-2 ఆగస్టు 13న విడుదల కానుంది. అలాగే మాస్‌ మహరాజా రవితేజ హీరోగా నటిస్తోన్న టైగర్‌ నాగేశ్వరరావులోనూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారీ దిగ్గజ నటుడు. ఇటీవలే ఆయన పాత్రకు సంబంధించి ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్‌లు విడుదలచేయనున్నారు మూవీ మేకర్స్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..