Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రమాదవార్త ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రమాదానికి వేగమే కారణమా… గాలీ వేగంతో ప్రయాణించే బైక్‌ను యంగ్ హీరో కంట్రోల్ చేయలేకపోయిరా..? ఈ విషయమీదే తీవ్రస్థాయిలో చర్చజరుగుతోంది. అయితే సాయి ధరమ్ తేజ్ స్పీడు బైక్స్ వాడటం కొత్తేం కాదు. ప్రస్తుతం ప్రమాధానికి గురైన ట్రైంప్ బైక్‌ను కూడా గత ఏడాది కాలంగా సాయితేజ్‌వాడుతున్నారు.
ఇవే కాదు సాయి గ్యారేజ్‌లో మరో మూడు సూపర్ బైక్స్ కూడా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి బైక్ లవర్ అయిన సాయి తేజ్‌కు తన ఫ్యామిలీ మెంబర్స్ కాస్ట్‌లీ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి కాస్ట్‌లీ బైక్సే ప్రిఫ్ చేశారు. చాలా కాలం కిందటే పవర్ స్టార్ పవన్ కల్యాన్ అవెంజర్ ను సాయి తేజ్‌కు గిఫ్ట్ ఇచ్చారు. తల్లి విజయ దుర్గ కూడా హై ఎండ్ మోడల్ హర్లీ డేవిడ్ సన్ బైక్‌ను సాయి ధరమ్‌కు స్పెషల్ గిఫ్ట్‌గా ఇచ్చారు.
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇచ్చే గిఫ్ట్సే కాదు.. తనకు తాను కూడా ఇలాంటి సూపర్ బైక్స్‌నే గిఫ్ట్ ఇచ్చుకుంటున్నారు సాయి ధరమ్ తేజ్. అందుకే అమ్మ, మామ ఇచ్చిన రెండు బైక్స్ కాకుండా మరో రెండు స్పీడు బైక్స్‌ను కొని పెట్టుకున్నారు. వీటి మీద వీకెండ్స్‌లో లాంగ్ డ్రైవ్స్‌కు వెళుతుంటారు సాయి ధరమ్ తేజ్. ముఖ్యంగా తన చిన్ననాటి స్నేహితుడు నవీన్ విజయకృష్ణతో కలిసి డ్రైవ్‌కు వెళ్లటం సాయి ధరమ్‌కు చాలా ఇష్టం.
అలాగే సింగిల్‌గా సిటీలో బయటకు వెళ్లాలన్న ఎక్కువగా టూ వీలర్‌నే ప్రిఫర్ చేస్తుంటారు సాయి ధరమ్ తేజ్. తన వాడే బైక్‌లకు తగ్గట్టుగా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకుంటారు. లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినప్పుడు తప్పుకుండా సేఫ్టి సూట్ వేసుకుంటారు. కానీ ప్రమాదం జరిగిన సమయంలో పార్టీకి వెళుతున్నారు కాబట్టి.. సేఫ్టీ సూట్ వేసుకోలేదు. ఈ కారణంగానే ప్రమాదంలో గాయాల తీవ్రత కాస్త ఎక్కువగా ఉంది.
దేశంలో టాప్-10 స్పోర్ట్స్ బైకులు ఇవే..
సాయి ధరమ్ తేజ్‌తో పలువురు సినీ సెలబ్రిటీలు, వారి పిల్లలకు దేశంలో అత్యంత ఖరీరైన స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి. వాటి ధర ఎంతో ఓ సారి లుక్కేయండి..
10. ట్రైంఫ్ రాకెట్ 3 2488సీసీ, ధర రూ.18 లక్షలు
9. హోండా గోల్డ్ వింగ్ 1833 సీసీ, ధర రూ. 29 లక్షలు
8.బీఎండబ్ల్యుకె 1600 బి 1649సీసీ ధర. రూ. 29 లక్షలు
7.బీఎండబ్ల్యుకె 1600 జీటీఎల్ 1649 cc ధర రూ. 29 లక్షలు
6. హార్లీ డేవిడ్ సన్ స్ట్రీట్ గ్లైడ్ స్పెషల్ 1868సీసీ ధర రూ.31 లక్షలు
5.హార్లీ డేవిడ్ సన్ రోడ్ గ్లైడ్ స్పెషల్ 1868 cc ధర రూ. 35లక్షలు
4. ఇండియన్ మోటార్ సైకిల్స్ చీఫ్టైన్ లిమిటెడ్ 1890సీసీ ధర రూ.39 లక్షలు
3.ఇండియన్ మోటార్ లైకిల్ ఛాలెంజర్ లిమిటెడ్ 1768సీసీ ధర రూ.40 లక్షలు
2.ఇండియన్ మోటార్ సైకిల్ రోడ్ మాస్టర్ 1890సీసీ ధర రూ. 42 లక్షలు
1.హర్లీ డేవిడ్ సన్ సీవీఓ లిమిటెడ్ 1923సీసీ ధర రూ.51 లక్షలు
– సతీష్, TV9 తెలుగు, ET డెస్క్
Also Read..