Pahalgam Terror attack: పహల్గామ్‌లోనే ఉన్నా.. వీడియో షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ పై నెటిజన్ల ఆగ్రహం.. ఎందుకంటే?

ఉగ్రవాదుల దుశ్చర్యకు అందమైన కశ్మీర్ మరోసారి రక్తసిక్తమైంది. మంగళవారం (ఏప్రిల్ 22) జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఏకంగా 28 టూరిస్టులు అక్కడికక్కడే అమరులయ్యారు. ఈ విషాద ఘటన యావత్ భారత దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

Pahalgam Terror attack: పహల్గామ్‌లోనే ఉన్నా.. వీడియో షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ పై నెటిజన్ల ఆగ్రహం.. ఎందుకంటే?
Bigg Boss Telugu Contestant

Updated on: Apr 23, 2025 | 5:10 PM

జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడితో యావత్ భారతదేశం విషాదంలో మునిగిపోయింది. విహార యాత్రకు వచ్చిన టూరిస్టులపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 28 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఉగ్ర దాడిని ప్రధాన మంత్రితో సహా పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అమరులకు నివాళులు అర్పిస్తున్నారు. కాగా ఈ ఉగ్రదాడి నుంచి పలువురు ప్రముఖులు త్రుటిలో తప్పించుకున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు బ్యూటీ, ఆర్జే కాజల్ కూడా ప్రస్తుతం పహల్గామ్ లోనే ఉందట. ఇటీవల ఆమె తన స్నేహితులతో కలిసి కశ్మీర్ టూర్ కు వెళ్లారట. అయితే మంగళవారం జరిగిన ఉగ్రదాడితో ఆర్జే కాజల్ కుటుంబ సభ్యులు బాగా కంగారు పడ్డారట. దీంతో తాను క్షేమంగా ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేసిందీ అందాల తార.

‘ ప్రస్తుతం మేము పహల్గామ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాము. మేము ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాము. రోడ్లు ప్రశాంతంగా ఉన్నాయి. అన్ని చోట్ల కట్టుదిట్టమైన భద్రత ను ఏర్పాటు చేశారు. నా వెల్ విషర్స్ అందరూ నాకు కాల్స్, మెసేజ్ లు చేస్తున్నారు, నా కోసం ఆరా తీస్తున్నారు. అందరికి చాలా థ్యాంక్స్. నేను క్షేమంగానే ఉన్నాను. ఇక్కడి లోకల్ పోలీస్ లు సెక్యూరిటీ గా ఉన్నారు. కశ్మీర్ ఎప్పటికి అందంగానే ఉంటుంది అంటూ’ వీడియోలో చెప్పుకొచ్చింది బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్.

ఇవి కూడా చదవండి

 పహల్గామ్ నుంచి ఆర్జే కాజల్ షేర్ చేసిన వీడియో..

 

ఆర్జే కాజల్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చాలామంది ఆమెకు జాగ్రత్తలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. అదే సమయంలో అక్కడ అంత మంది చనిపోతే కశ్మీర్ ప్రశాంతంగా ఉందని అంటావా? కనీసం చనిపోయిన వారికి నివాళులైన అర్పించావా? అంటూ ఫైర్ అవుతున్నారు.

రంజాన్ వేడుకల్లో ఆర్జే కాజల్..

కాగా పహల్గామ్ టెర్రర్ అటాక్ పై టాలీవుడ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మెగాస్టార్ చిరంజీవి మొదలు స్టార్ హీరోలందరూ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

చిరంజీవి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.