AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: మూడు సినిమాల్లో హీరో ఛాన్స్.. ఆధార్ కార్డులో కులం చూసి తీసేశారు.. పాపం బిగ్‌బాస్ కంటెస్టెంట్

ఈ నటుడు సీరియల్స్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. పలు సూపర్ హిట్ సినిమాల్లో సహాయక నటుడిగా మెప్పించాడు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతోనూ బాగా పాపులర్ అయ్యాడు. అయితే హీరో అవ్వాల్సిన ఇతనిని ఆధార్ కార్డులో కులం చూసి తీసేశారట.

Bigg Boss: మూడు సినిమాల్లో హీరో ఛాన్స్.. ఆధార్ కార్డులో కులం చూసి తీసేశారు.. పాపం బిగ్‌బాస్ కంటెస్టెంట్
Bigg Boss Telugu Fame
Basha Shek
|

Updated on: May 01, 2026 | 11:20 AM

Share

సినిమా ఇండస్ట్రీ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంటుంది. కానీ ఈ వెలుగుల వెనక కనిపించని ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. క్యాస్టింగ్ కౌచ్, కుల వివక్ష తదితర కారణాలతో చాలా మంది ట్యాలెంట్ ఉన్నా గుర్తింపు తెచ్చకోలేకపోయారు. ఈ టాలీవుడ్ నటుడు కూడా సరిగ్గా ఇలాంటి కోవకే చెందుతాడు. ఈ నటుడు గతంలో ‘మొగలిరేకులు’ వంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించాడు. తన నటనతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ పార్టిసిపేట్ చేశాడు. విజేతగా నిలవకున్నా తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ అభిమానుల మనసులు గెల్చుకున్నాడు. ఇదే పాపులారిటీతో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. తన ట్యాలెంట్ కు తగ్గట్టుగానే చాలా సినిమాల్లో ఛాన్స్ లు కూడా వచ్చాయి. హీరోగా కూడా మూడు సినిమాల్లో అవకాశం వచ్చింది. అయితే తక్కువ కులం కారణంగా సినిమాలు ఆగిపోయాయట. హీరోగా కమిటైన మూడు సినిమాలు అగ్రిమెంట్‌ వరకు వచ్చి ఆ తర్వాత ఆధార్ కార్డులో తన కులం చూసి ఆగిపోయాయట. ఈ విషయాన్ని సదరు నటుడే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. అతను మరెవరో కాదు విరూపాక్ష, దండోరా సినిమాల ఫేమ్ రవికృష్ణ.

ఆ మధ్యన రవికృష్ణ ప్రధాన పాత్రలో నటించిన దండోరా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో తక్కువ కులానికి చెందిన యువకుడిగా రవి అద్బుతంగా నటించాడు. అగ్ర కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడి.. ఆమె కులం వాళ్ల చేతిలో దారుణ హత్యకు గురైన ప్రేమికుడి పాత్రలో రవి నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలోనే మాట్లాడిన రవి కృష్ణ దండోరా సినిమాలో మాదిరే నిజ జీవితంలో తాను కూడా కుల వివక్షకు గురయ్యానని కన్నీటి పర్యంతం అయ్యాడు.

ఇవి కూడా చదవండి

రవి కృష్ణ లేటెస్ట్ ఫొటోస్..

‘కొంతమంది నన్ను హీరోగా సెలెక్ట్‌ చేసి చివరిలో నా కులం చూసి పక్కకు తప్పించారు. ఓ సినిమాకి అగ్రిమెంట్‌ భాగంగా నా ఆధార్‌ కార్డు పంపించాను. అ‍క్కడ నా కులం చూసి తప్పించారు. కారణం ఏంటని అడిగితే.. ఈ కథ మీకు సూట్ అవ్వదు.. ఇంకో ప్రాజెక్ట్‌కు చూద్దాం అని చెప్పారు. అలా మూడు సినిమాలు అగ్రిమెంట్‌ వరకు వచ్చి..కులం చూసి ఆగిపోయాయి’ అని రవి ఎమోషనల్ అయ్యాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో సంచలనం..!
హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో సంచలనం..!
డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..!
డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..!
వాట్సాప్‌లో బెస్ట్ ఫీచర్.. రెండు ఫోన్‌ కెమెరాలు ఒకేసారి..!
వాట్సాప్‌లో బెస్ట్ ఫీచర్.. రెండు ఫోన్‌ కెమెరాలు ఒకేసారి..!
ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని ఆహారాలు ఏంటో తెలుసా..?
ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని ఆహారాలు ఏంటో తెలుసా..?
బిల్లుపై పోరుకు కాంగ్రెస్ రెడీ.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మిత్రులు!
బిల్లుపై పోరుకు కాంగ్రెస్ రెడీ.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మిత్రులు!
కార్తీక శనివారం వేంకటేశ్వర స్వామి పూజ.. ఇంట్లోనే ఇలా పూజిస్తే..
కార్తీక శనివారం వేంకటేశ్వర స్వామి పూజ.. ఇంట్లోనే ఇలా పూజిస్తే..
బంగారంపై రుణం తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి నోటీసులు.. ఎందుకంటే
బంగారంపై రుణం తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి నోటీసులు.. ఎందుకంటే
జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ బిగ్ షాక్.. ఇకపై లెక్క మారాల్సిందేనా ?
జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ బిగ్ షాక్.. ఇకపై లెక్క మారాల్సిందేనా ?
Hyundai Ioniq Pతో Tata Nexon మార్కెట్​ తగ్గుతుందా?
Hyundai Ioniq Pతో Tata Nexon మార్కెట్​ తగ్గుతుందా?
జనవరి నుంచే జలగండం..? జలాశయాల్లో జీరో లెవల్స్.. హైదరాబాద్ అంతటా..
జనవరి నుంచే జలగండం..? జలాశయాల్లో జీరో లెవల్స్.. హైదరాబాద్ అంతటా..