
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు డీమాన్ పవన్. అగ్నిపరీక్ష ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన అతను తన ఆట, మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. సీజన్ ఆద్యంతం అద్భుతంగా ఆడిన పవన్, ఫైనల్ దశ వరకు చేరి టాప్-3లో నిలిచాడు. అయితే తన తండ్రి చికిత్స కోసం రూ.15 లక్షల సూట్‌కేస్ ఆఫర్‌ను స్వీకరించి షో నుంచి బయటికి వచ్చాడు. అనుకున్నట్లుగానే బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బుతో పవన్ తన తండ్రి దుర్గా ప్రసాద్ కు చికిత్స చేయించారు. అయితే గత నెలలో వ్యాధి తీవ్రత మరింత పెరగడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీంతో పవన్ బాగా తల్లడిల్లిపోయాడు. ఈ విషాదం నుంచి ఇప్పటికీ ఇంకా తేరుకోలేకపోతున్నాడు పవన్. ఇదిలా ఉంటే మరోవైపు సోషల్ మీడియా వేదికగా డీమాన్ పవన్ పై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. కొంత మంది నెటిజన్లు అతనితో పాటు అతని కుటుంబ సభ్యులపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా సార్లు ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చిన పవన్ ఈసారి మాత్రం మరింత ఇంటెన్స్ తో హెచ్చరించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ షాకింగ్ పోస్టు పెట్టాడు డీమాన్ పవన్.
‘చాలా మంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను తప్పు చేయకపోయినా కూడా కొంత నెగటివిటీ, ద్వేషాన్ని భరించగలిగే వ్యక్తిని. నేను ఎక్కువగా క్షమించడం, ప్రశాంతంగా ఉండడం గురించే ఆలోచిస్తాను. నేను మంచికి మంచి చేసే వ్యక్తిని. అందుకే ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను. అలాగనీ నన్ను అలుసుగా తీసుకోవద్దు. నాలోని రాక్షసుడు బయటకు వస్తే తట్టుకోలేరు’ అని ట్రోలర్స్ కు డీమాన్ పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు డీమాన్ పవన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. అతనిపై ట్రోలింగ్ ఆపేయాలని కోరుతున్నారు.
కాగా బిగ్ బాస్ తర్వాత పలు టీవీ షోస్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు పవన్. రీతూ చౌదరితో కలిసి బీబీ జోడీ డ్యాన్స్ షోలో బాగానే సందడి చేశాడు పవన్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.