
బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ తర్వాత ఇప్పుడు చిత్ర విచిత్ర టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఈ క్రమంలో ఈ రోజు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ తమ అర్హతలను బట్టి ర్యాంక్ వైజ్ గా నిలబడాలని చెప్పాడు బిగ్ బాస్. హౌస్ లో ఉన్నవారంతా చర్చించి ఒకటి నుంచి పది వరకు నిలబడ్డారు. ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో శివాజీకి నెంబర్ 01, యావర్‌కి నెంబర్ 02, ప్రశాంత్‌కి నెంబర్ 03, ప్రియాంక 4 , శోభా 5, అమర్ 6, గౌతమ్‌కి 7, అర్జున్‌కి 8 , అశ్విని 9, రతికాకు 10 స్థానాలు ఇచ్చారు. ఇక నేటి ఎపిసోడ్ లో ఏవిక్షన్ పాస్ కోసం టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. తాజాగా వదిలిన ప్రోమోలో అర్జున్ కు టాస్క్ ఇచ్చినట్టు చూపించారు.
అర్జున్ ను పిలిచిన బిగ్ బాస్ తన ఏవిక్షన్ పాస్ ను ఒకటి నుంచి ఐదు వరకు ర్యాంక్ లలో ఉన్న మెంబర్స్ లో పోరాడి డిఫెండ్ చేసుకోవాలని చెప్పాడు. ఏ ఆటలో ఓడిన వారు ఏవిక్షన్ పాస్ రేస్ నుంచి మొత్తానికే తప్పుకుంటారు అని చెప్పాడు బిగ్ బాస్. ఇక ఇచ్చిన ఛాలెంజ్ లో ఫ్లాట్ ఫామ్ పై ఉన్న స్లాట్స్ లో ఐదు బాల్స్ ను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్. అర్జున్ ఈ ఛాలెంజ్ కోసం యావర్ ను ఎంచుకున్నాడు అర్జున్.
అలాగే ఈ ఛాలెంజ్ కు అమర్ దీప్ సంచలక్ గా ఉన్నాడు. బజార్ మోగగానే ఇద్దరు గేమ్ స్టార్ట్ చేశారు. ఇద్దరు పోటాపోటీగా గేమ్ ఆడారు. ఆతర్వాత రతికా అమర్ కు అర్జున్ కు పుల్ల పెట్టె ప్రయత్నం చేసింది. సంచలక్ గా ఉన్న అమర్ ఏమైనా చేస్తాడని అనుకున్నా అని అర్జున్ తో చెప్పింది. దాంతో అశ్విని అమర్ కూడా ఏం చేయలేడు అని చెప్పింది. ఆతర్వాత గ్రూప్ గ్రూప్ గా ఆడుతున్నారని అనిపిస్తుంది అని రతికా అర్జున్ కు చెప్పింది. మరో వైపు శివాజీ, యావర్, ప్రశాంత్ కుర్చీని ఉండగా యావర్ ఒకేవేళ నేను చీట్ చేస్తే నేను చెప్తాను బిగ్ బాస్ కు అని అన్నాడు. రతికా ఎందుకు అలా తయారైయింది అంటూ శివాజీ ప్రశాంత్, యావర్ తో డిస్కషన్ పెట్టాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.