Bigg Boss Telugu 10: చరణ్ ఎలిమినేషన్‌కు కారణాలివే.. నాలుగు వారాలకు ఎంత డబ్బు వచ్చిందంటే?
చరణ్ మొదటి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్‌లోనే బిగ్ బాస్ హౌజ్‌ని వీడాడు. అయితే అదృష్టం ఉండడంతో రెండో వారంలోనే మళ్లీ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే చరణ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఏ మాత్రం కంటెంట్ ఇవ్వకుండా అందరినీ నిరాశపరిచాడు.

బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ లో మరో వారం ముగిసింది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో ఐదో వారం కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి అయ్యింది. ఈ ఆదివారం (అక్టోబర్ 11) వీకెండ్ ఎపిసోడ్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొదట అపూర్వ హౌస్ నుంచి బయటకు రాగా ఆ తర్వాత చరణ్ బిగ్ బాస్ హౌస్ ను వీడాడు. ఇక ఐదో వారంలోనే ఐదుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అంతకు ముందు కూడా ఇద్దరు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు మొత్తంగా ఏడుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా రాగా మొదట వచ్చిన ఇద్దరు ఎలిమినేట్ కావడం గమనార్హం. వారితోపాటు మొదటివారంలో ఎలిమినేట్ అయిన చరణ్ మళ్లీ ఎలిమినేట్ అయ్యాడు. ఐదో వారంలో డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా అతను హౌజ్‌ని వీడాడు. కాగా బిగ్ బిస్ హౌస్ లోకి మెయిన్ కంటెస్టెంట్ గా వచ్చాడు చరణ్. అయితే మొదటి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్‌లోనే హౌజ్‌ని వీడి బయటకు వెళ్లిపోయాడు. అతనితో పాటు చైత్రరాయ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అదృష్టం కొద్దీ మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీఇచ్చాడు. అయితే ఈ రీ ఎంట్రీ ఛాన్స్ ను ఏ మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు చరణ్. ఆడియెన్స్ కు అవసరమైన కంటెంట్ ఇవ్వకుండా హౌస్ లో సైలెంట్ గా ఉండిపోయాడు. పైగా ఫిజికల్ టాస్కుల్లోనూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.
చరణ్ ఆటతీరు మార్చుకోవాలని నాగార్జున పదే పదే అతనిని హెచ్చరించాడు. కానీ చరణ్ ఆటతీరుతో మాత్రం ఏ మార్పు రాలేదు. దీంతో ఐదో వారంలో డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా అపూర్వతోపాటు చరణ్ ను కూడా బయటకు పంపించేశారు. ఈ నేపథ్యంలో చరణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. చరణ్ కామనర్ కేటగిరిలో బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. ఆయన అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా కామనర్స్ కి వారానికి రూ.70 వేల నుంచి లక్ష వరకు ఇవ్వాలని బిగ్ బాస్ నిర్వాహకులు నిర్ణయించారట. ఈ నేపథ్యంలో మధ్యలో ఒక వారం తీసేస్తే మొత్తం నాలుగు వారాల పాటు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నాడు చరణ్. ఈ లెక్కన నాలుగు వారాలు ఉన్న చరణ్ కి దాదాపు మూడు లక్షలు పారితోషికం రూపంలో అందుతుందని చెప్పవచ్చు.
బిగ్ బాస్ హౌస్ లో చరణ్ జర్నీ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




