Bigg Boss 6 Telugu: నువ్వు ఎవరు ఆటలో ఇన్వాల్వ్ కావడానికి.? గీతూకి గడ్డి పెట్టిన నాగార్జున

|

Oct 29, 2022 | 6:25 PM

. చిత్తూరు చిరుత అని చెప్పుకుంటూ ఈ అమ్మాయి చేసే హడావిడి అంతా ఇంత కాదు. హౌస్ లో ఓవర్ యాక్షన్ చేస్తూ.. ,మిగిలిన వాళ్ళను తక్కువ చేసి మాట్లాడుతూ.. ప్రేక్షకుల చేత వరస్ట్ బిహేవియర్ అనిపించుకుంటోంది.

Bigg Boss 6 Telugu: నువ్వు ఎవరు ఆటలో ఇన్వాల్వ్ కావడానికి.? గీతూకి గడ్డి పెట్టిన నాగార్జున
Nagarjuna , Geetu
Follow us on

బిగ్ బాస్ సీజన్ 6 ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఎవరో కూడా ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఇక ఈ సీజన్ లో హౌస్ లోకి వచ్చిన వాళ్ళల్లో గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్తూరు చిరుత అని చెప్పుకుంటూ ఈ అమ్మాయి చేసే హడావిడి అంతా ఇంత కాదు. హౌస్ లో ఓవర్ యాక్షన్ చేస్తూ.. ,మిగిలిన వాళ్ళను తక్కువ చేసి మాట్లాడుతూ.. ప్రేక్షకుల చేత వరస్ట్ బిహేవియర్ అనిపించుకుంటోంది. ఇప్పటికే హౌస్ లో ఉన్న చాలా మంది గీతూ పై రివర్స్ అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్లకు కూడా ఇరిటేషన్ తెప్పిస్తుంది అంటూ బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులు అంటున్నారు. ఇక తాజాగా ఎపిసోడ్ లో గీతూ కి కావాల్సినంత గడ్డి పెట్టారు కింగ్ నాగార్జున.

ఇక తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.. ఈ ప్రోమోలో గీతూకి గట్టి క్లాస్ తీసుకున్నారు నాగ్. ‘ఫిజికల్ గేమ్ ఇవ్వండి బిగ్ బాస్ గుద్దిపడేస్తా’ ఫిజికల్ గేమ్‌లో.. ఆమె ఆడకపోగా.. ఆదిరెడ్డిని సైతం ఆటాడకుండా చేసింది. ‘నీ పార్టనర్ ఫిజికల్ గేమ్‌ ఇస్తే గుద్దిపడేస్తా’ అన్నది కదా.. నిజంగానే గుద్దిపడేసిందా? అని ఆదిరెడ్డి అడిగారు నాగార్జున. ఇంతలో  గీతూ మాట్లాడుతూ.. ‘గుద్దిపడేశా’ సార్ అని అంటుంది. ఆ మాటతో నాగార్జునకి చిర్రెత్తుకొచ్చింది. ‘నిన్ను అడగలేదు గీతూ’ అని వేలెత్తి చూపిస్తూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ‘ఆడింది సార్..’ అని ఆదిరెడ్డి అనేసరికి.. ఔనా మరి మీరెందుకు లీస్ట్‌లో ఉన్నారు.. అని ప్రశ్నించాడు.

నువ్వు గెలవడం కోసం కాదు.. అవతల వాళ్ల వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలని ట్రై చేశావ్.. ‘నేను ఉన్న సీజన్‌లో వాళ్లు ఆడకపోయినా నేనే ఆడిపించాలని.. అందర్నీ రెచ్చగొట్టా.. గట్టిగా ఆడించాలనే అలా చేశాను సార్.. అని గీతు అన్నది. వెంటనే.. ‘గేమ్‌ని ఇంట్రస్ట్‌గా చేయడం మా బిగ్ బాస్ చూసుకుంటారు.. అసలు నువ్వు ఎవరు? వాళ్లతో ఆడించడానికి? ఎవరి ఆట వాళ్లు ఆడితే సీజన్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది’ అని అన్నారు. ఆట ఆడకపోతే నాకు మెంటల్ ఎక్కిపోతుంది.. నేను బయట కూడా గేమర్‌ని సార్.. అని గీతు అనేసరికి’.. ఎదుటి వాళ్ల వీక్నెస్‌తో ఆట ఆడాలనుకోవడం గేమర్ లక్షణం కాదు.. అసలు నువ్వు ఎవరు ఆటలో ఇన్వాల్వ్ కావడానికి.? సంచాలక్ అంటే.. అంపైర్.. నీ ఆట బొచ్చులో ఆట అయిపోయింది. ఈ మాట నిన్ను అంటే బాలేదు కదా.. కోపం వస్తే నీకు అసలు కామన్ సెన్స్ పనిచేయదా.. నువ్ చేసిన పనికి పనిష్మెంట్ తప్పదు’ అని  అన్నారు నాగ్ మరి గీతూ కి నాగ్ ఏం పనిష్మెంట్ ఇచ్చారో చూడాలి.