Shanmukh Jaswanth : ప్రియురాలిని పెళ్లి చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్.. వైష్ణవితో షన్నూ ఏడడుగులు..

షార్ట్ ఫిల్మ్స్, సిరీస్ ద్వారా యూట్యూబ్ స్టార్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ ద్వారా యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక అదే గుర్తింపుతో విన్నర్ మెటిరియల్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. కానీ రన్నరప్ అయ్యాడు. ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకున్న షన్నూ.. కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యాడు.

Shanmukh Jaswanth : ప్రియురాలిని పెళ్లి చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్.. వైష్ణవితో షన్నూ ఏడడుగులు..
Shanmukh Jaswanth Vaishnavi Wedding

Updated on: Jun 22, 2026 | 4:26 PM

షణ్ముఖ్ జస్వంత్.. తెలుగు సినీ, బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్, సిరీస్ ల ద్వారా యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వంటి సిరీస్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి రన్న రప్ అయ్యాడు. ప్రస్తుతం ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా సినీరంగంలో సైలెంట్ అయిన షన్నూ.. తాజాగా ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు వైష్ణవితో ఏడడుగులు వేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో రాజమండ్రికి చెందిన వైష్ణవి చోడిశెట్టితో నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలోనే తన కాబోయే భార్యను అభిమానులకు పరిచయం చేశాడు. ఆ తర్వాత వైష్ణవితో కలిసి కొత్తింట్లోకి అడుగుపెట్టాడు. ఇక ఇప్పుడు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు షణ్ముఖ్. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..

షణ్ముఖ్ జస్వంత్ విషయానికి వస్తే.. యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. వైవా షార్ట్ ఫిల్మ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. కానీ షన్నూ కెరీర్ మలుపు తిప్పింది మాత్రం సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్. ఇందులో అతడి యాక్టింగ్ కు యూత్ ఫిదా అయిపోయారు. ఈ సిరీస్ ద్వారా జనాలకు దగ్గరైన షన్నూ.. ఆ తర్వాత సూర్య సిరీస్ ద్వారా మరోసారి అలరించారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి రన్నరప్ అయ్యారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‏లో ఉన్న వెబ్ సిరీస్..

ఈ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన సహ యూట్యూబర్ దీప్తి సునైనాతో బ్రేకప్ అయ్యింది. దీంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు షన్నూ. ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకోవడంతో ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యాడు. కొన్ని రోజుల క్రితం వైష్ణవితో ప్రేమలో పడిన షన్నూ.. ఇటీవలే ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు కుటుంబసభ్యుల సమక్షంలో వైష్ణవి మెడలో మూడు ముళ్లు వేశాడు.

ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..

షన్నూ పెళ్లి వీడియో…

ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..

Follow Us