ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు.. అయినా అతనంటే నాకు పిచ్చి అంటున్న బ్యూటీ

బిగ్ బాస్ వల్ల చాలా మంది పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాతో పాపులర్ అయిన వారిలో ఈ అమ్మడు ఒకరు. బిగ్ బాస్ వల్ల చాలా మందికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆతర్వాత చాలా పాపులర్ అయ్యి.. ఇప్పుడు టీవీ షోలతో అదరగొడుతున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు.

ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు.. అయినా అతనంటే నాకు పిచ్చి అంటున్న బ్యూటీ
Actress

Updated on: Mar 15, 2026 | 5:17 PM

ఈ చిన్నది ముందుగా సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యింది. ఆతర్వాత సోషల్ మీడియాలో షార్ట్ వీడియోస్ తో క్రేజ్ సొంతం చేసుకుంది. పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించింది. అయితే హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఈ అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆతర్వాత బిగ్ బాస్ ఆఫర్ అందుకుంది. అయితే ఈ అమ్మడు చేసిన పనికి ఓ స్టార్ హీరో షాక్ అయ్యాడట. అంతే కాదు ఆమె నెంబర్ ను బ్లాక్ కూడా చేశాడట. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరు.? ఆ స్టార్ హీరో ఎవరు.? ఇంతకూ ఆమె ఏం చేసిందంటే..

బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన బ్యూటీస్‌లో శ్రీ సత్య ఒకరు. ముద్ద మందారం, నిన్నే పెళ్లాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు, మరియు త్రినయని సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది నటి శ్రీసత్య. విజయవాడలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ మొదట మోడలింగ్‌లో అదృష్టం పరీక్షించుకుంది. మిస్ ఏపీ టైటిల్‌ను కూడా గెల్చుకుంది. ఆతర్వాత నటనపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కాగా 2017లో రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించింది శ్రీసత్య. గోదారి నవ్వింది, లవ్ స్కెచ్ సినిమాల్లోనూ కనిపించింది. ఈక్రమంలోనే సీరియల్స్‌లోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి

తనదైన అందం, అభినయంతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా ఈ సీజన్‌లో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆమె తెలివిగా గేమ్‌ ఆడి మెప్పించింది. ప్రస్తుతం బీబీ జోడీ షోలో తన డాన్స్ లతో ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిన్నది గతంలో మాట్లాడుతూ.. తన అభిమాన హీరో రామ్ పోతినేని అని చెప్పింది. అయితే నేను శైలజ సినిమా షూటింగ్ సమయంలో ఆమె రామ్ పోతినేని నెంబర్ కనుక్కుందట. అయితే ఆ వయసులో ఆమె చాలా చిన్నదట. తెలిసి తెలియని వయసులో ఆమె రామ్ కు హాయ్, ఐ లవ్ యూ అని మెసేజ్ చేశా.. అని తెలిపింది. అయితే ఆ మెసేజ్ చూడగానే నా నెంబర్ ను రామ్ బ్లాక్ చేశాడని, దాంతో తాను షాక్ అయ్యాను అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us