Bigg Boss Sohel: నడి సముద్రంలో బిగ్‏బాస్ సోహైల్‏కు ప్రమాదం.. పడవలో నుంచి పడిపోయి..

|

Dec 23, 2022 | 7:34 PM

తాజాగా యూట్యూబర్ లోకల్ బాయ్ నానితో కలిసి సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు సోహైల్. విశాఖపట్నంకు చెందిన నాని చేపలు పడుతూ ఉంటారు. అందుకు సంబంధించిన విషయాలను వీడియోస్ తీని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా వీడియో షేర్ చేశాడు. అతని బోట్ లో సరాదాగా గడిపిన సోహైల్ అనుకోకుండా ప్రమాదంలో పడ్డాడు.

Bigg Boss Sohel: నడి సముద్రంలో బిగ్‏బాస్ సోహైల్‏కు ప్రమాదం.. పడవలో నుంచి పడిపోయి..
Sohel
Follow us on

బిగ్ బాస్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సోహైల్. అంతకు ముందు పలు సీరియల్స్ లో నటించాడు. కానీ ఈ షోలో సోహైల్ ఆట తీరు… అరియానాతో కోపం.. అల్లరి ఆడియన్స్ ను ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు. బిగ్ బాస్ అనంతరం సోహైల్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు. తాజాగా యూట్యూబర్ లోకల్ బాయ్ నానితో కలిసి సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు సోహైల్. విశాఖపట్నంకు చెందిన నాని చేపలు పడుతూ ఉంటారు. అందుకు సంబంధించిన విషయాలను వీడియోస్ తీని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా వీడియో షేర్ చేశాడు. అతని బోట్ లో సరాదాగా గడిపిన సోహైల్ అనుకోకుండా ప్రమాదంలో పడ్డాడు. ఆకస్మాత్తుగా జరిగిన ప్రమాదంతో అక్కడున్నవారంత షాకయ్యారు.

యూట్యూబ్ లో ఫేమస్ అయినా.. లోకల్ బాయ్ నానిని కలిసేందుకు బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ వైజాగ్ వెళ్లాడు. ఊర మాస్ గా కనిపించేందుకు లుంగి కట్టి.. తలకు క్లాత్ కూడా చూట్టాడు. నానితో కలిసి సముద్రంలోకి సోహైల్ వెళ్లాడు. అక్కడ వల వేయడం, చేపలు పట్టడం లాంటివి సోహైల్ దగ్గరుండి చూపించాడు నాని.

అయితే పడవ చివర్లో నిల్చునే క్రమంలో సోహైల్ సముద్రంలో పడిపోయాడు. దీంతో వెంటనే నాని కూడా సముద్రంలోకి దూకేసి సోహైల్ ను సేవ్ చేశాడు. ఇదంతా సడన్ గా జరిగేసరికి బోట్ లో ఉన్నవాళ్లు కంగారు పడిపోయారు. సోహైల్ తో వచ్చిన వ్యక్తి తెగ భయపడిపోయారు. సోహైల్ క్షేమంగా బయటపడిన మోకాళ్లపై గట్టిగా దెబ్బలు తగిలాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.