Karate Kalyani : సెలబ్రెటీలు రాజకీయాల్లోకి అడుగు పెట్టడం కొత్తేమీ కాదు. సినిమా చాలా మంది సినిమా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. రకరకాల పార్టీల్లో చాలా మందే సినిమా ఆర్టిస్టులు ఉన్నారు. కొందరు రాణిస్తుంటే.. మరి కొందరు పార్టీలకు మద్దతు తెలుపుతూ సైలెంట్‌గా ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా కరాటే కళ్యాణి కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కరాటే కళ్యాణి నేడు పార్టీలో చేరారు. జల్ పల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ సహా పలువురు జైన్ కమ్యూనిటీ నేతలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీ విజయశాంతి సమక్షంలో కరాటే కళ్యాణి సహా పలువురు నాయకులు పార్టీ కండువా కప్పుకున్నారు.
ఇక కరాటే కళ్యాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. అంతే కాదు సమాజంలో జరిగే విషయాలపైనా కూడా ఆమె స్పందిస్తూ ఉంటారు. ఇటీవలే రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నారు. ఇక కరాటే కళ్యాణి ముక్కుసూటి మనిషి అన్న విషయం తెలిసిందే.