
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ రన్నరప్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తోన్న చిత్రమ సోలో బాయ్. నవీన్ కుమార్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా హీరోయిన్లుగా నటించారు. అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ, ఆర్కే మామ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న సోలో బాయ్ సినిమా జులై 04న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం బిజి బిజీగా ఉంటోంది. తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ గ్రాండ్ గా జరిగింది. సీనియర్ డైరెక్టర్ వీ వీ వినాయక్ ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ సంగతి పక్కన పెడితే గౌతమ్ కృష్ణ అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశాడు. సోలో బాయ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ స్టేజ్ పైనే మురళీ నాయక్ కుటుంబానికి లక్ష రూపాయలు గూగుల్ పే చేశాడు. అయితే దీనిని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీనిని గౌతమ్ కృష్ణ తప్పు పట్టాడు. సోలో బాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన అతను నెటిజన్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
దివంగత జవాన్ మురళి నాయక్ గారి కుటుంబానికి మేము అండగా నిలిచి ఆర్థిక సాయం చేశాం. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఆ కుటుంబానికి ఇప్పటికే ఎంతోమంది సహాయం చేశారు, ఇంకా మీరు ఎందుకు ఇస్తున్నారు? అని అంటున్నారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మురళీ నాయక్ ఫ్యామిలీకి సాయం చేస్తే విమర్శించడం సరికాడు. ఆయనకు డబ్బులు ఇవ్వడంలో తప్పేం ఉంది? మురళీ నాయక్ ఒక సైనికుడు. ఆయనకు మర్యాద ఇచ్చి మాట్లాడండి. జై హింద్’ అంటూ ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు గౌతమ్ కృష్ణ.
సోలో బాయ్ సినిమా ఈవెంట్ లో గౌతమ్ కృష్ణ
ప్రస్తుతం గౌతమ్ కృష్ణ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. మురళీ నాయక్ కుటుంబాన్ని ట్రోల్ చేయడం సరికాదని నెటిజన్లు హీరోకు మద్దతుగా నిలుస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..