‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు.. వీడియో

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు'. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మెగా మూవీ ఐదు రోజుల్లోనే రూ.226 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ మెగా మూవీ గురించి నెగెటివ్ రివ్యూ ఇచ్చి ఇబ్బందుల్లో పడింది బిగ్ బాస్ బ్యూటీ.

‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు.. వీడియో
Chiranjeevi Mana Shankara Vara Prasad Garu Movie

Updated on: Jan 17, 2026 | 12:44 PM

మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సినిమా  ‘మన శంకరవరప్రసాద్ గారు’. నయనతార కథానాయికగా నటించగా, విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరిశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. కేవలం రూ. 5 రోజుల్లోనే రూ.226 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మెగస్టార్ చిరంజీవి పవర్ ను మరోసారి ప్రూవ్ చేసింది. సామాన్య జనాలతో పాటు పలువురు సినీ తారలు కూడా మన శంకరవరప్రసాద్ గారు సినిమాను చూస్తున్నారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన దివ్య నికితా మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు నెగెటివ్ రివ్యూ ఇచ్చి ట్రోల్స్ బారిన పడింది. ఈ మేరకు మెగా మూవీకి పదికి 5 రేటింగ్ ఇచ్చిన ఆమె వీడియోలో ఇలా చెప్పుకొచ్చింది..

‘ఖర్చులేని యాపారం కదా.. ఈ మధ్య ప్రతి ఒక్కడూ రివ్యూవర్ అయిపోయాడు. ఫోన్ ఉంది కదా అని నోటికి వచ్చినట్లు చెప్పేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై నా మినీ రివ్యూ. మీకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా నచ్చితే ఇది కూడా నచ్చుతుంది. అనిల్ రావిపూడి ఇప్పుడే గతంలో చేసిన చిత్రాల మాదిరిగానే ఉంది. మీకు నచ్చితే మీరు కూడా సినిమాని చూడండి’’ అని చెప్పింది. అలాగే తన వీడియోకు ‘5/10.. ఇది జస్ట్ నా ఒపీనియన్.. జస్ట్ పాస్.. అది కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ది వ్య నికితా షేర్ చేసిన వీడియో…

దివ్య నికితా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లలో చాలా మంది బిగ్ బాస్ బ్యూటీని ట్రోల్ చేస్తున్నారు. అందరూ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తుంటే మీరు మాత్రం ఇలా నెగెటివ్ రివ్యూ ఇస్తున్నారేంటి? ఇదేం బాగోలేదు’ అంటూ బిగ్ బాస్ బ్యూటీని ట్రోల్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..