AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్‏లోకి తేజూ ఎంట్రీ.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన అమర్ దీప్..

బిగ్ బాస్ తనకి రీచ్‌ని ఇచ్చిందని, కానీ నిజమైన ఫేమ్ కష్టంతోనే వస్తుందని బిగ్ బాస్ రన్నరప్ అమర్‌దీప్ చౌదరి తెలిపారు. అలాగే తన భార్య తేజూ బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తుందని కొన్ని రోజులుగా సోషళ్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. తాజాగా ఈ రూమర్స్ పై అమర్ దీప్ మాట్లాడుతూ అసలు విషయం బయటపెట్టారు. కెరీర్ భయాలు, కష్టాలు, ఆస్తుల పుకార్లను ఖండించి, ఆరోగ్యకరమైన జీవనం సాగిస్తున్నానని వివరించారు.

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్‏లోకి తేజూ ఎంట్రీ.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన అమర్ దీప్..
Amardeep
Rajitha Chanti
|

Updated on: Aug 08, 2026 | 5:37 PM

Share

బుల్లితెర ప్రేక్షకులకు ఇష్టమైన సీరియల్ హీరోలలో అమర్ దీప్ ఒకరు. నటనతోపాటు తన కామెడీతోనూ అడియన్స్ హృదయాలు గెలుచుకున్నారు. బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న అమర్ దీప్.. రన్నరప్ గా నిలిచారు. ఇక ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమర్ దీప్.. బిగ్ బాస్ అనుభవం, కెరీర్ సవాళ్లు, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తన భార్య తేజస్విని బిగ్ బాస్ సీజన్‌లోకి వస్తున్నారన్న పుకార్లపై ఆయన స్పష్టత ఇచ్చారు. బిగ్ బాస్ తనకు “రీచబిలిటీ” మాత్రమే ఇచ్చిందని అమర్‌దీప్ చౌదరి తెలిపారు. “నాకు బిగ్ బాస్ వల్ల నాకేం ఫేమ్ రాలేదు. ఆల్రెడీ ఫేమ్ ఉండి బిగ్ బాస్ లోకి వెళ్లి ఇంకా కొద్దిగా రీచబిలిటీ తెచ్చుకున్నాను,” అని ఆయన అన్నారు. బిగ్ బాస్ అనేది “మూడు నెలల ముచ్చట” అని, ఆ తర్వాత వ్యక్తిగత శ్రమ, సరైన నిర్ణయాలే జీవితానికి కీలకం అని చెప్పారు. రాత్రికి రాత్రే ఎవ్వరూ స్టార్ అవ్వలేరని, మన కష్టం, మనం తీసుకునే స్టెప్స్ పైనే పైకి వస్తామని ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ విషయంలో తనకు స్పష్టత ఉందని, లేకపోతే జీవితంలో తికమక ఉంటుందని పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

తేజస్విని బిగ్ బాస్ ఎంట్రీ పుకార్లపై స్పష్టత..

తేజస్విని ఈ సీజన్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశిస్తున్నారన్న వార్తలను అమర్‌దీప్ ఖండించారు. “ఎక్కడ అది సీరియల్ చేస్తుంది. ఎక్కడికి పోతుంది ఆవిడ. ఎక్కడికి పోదు ఇంకా సీరియల్ అవుతుంది, తమిళ్ సీరియల్ చేస్తుంది, హైలీ అవుతుంది. ఇంకా వన్ ఇయర్ ఉంది,” అని ఆయన తెలిపారు. ఈ సీజన్‌లో తేజస్విని ప్రవేశం లేదని, బహుశా వచ్చే ఏడాది లేదా ఆ తర్వాత ఆమె బిగ్ బాస్ లోకి వెళ్లవచ్చని స్పష్టం చేశారు. తనను ట్రోల్ చేసే వారిని తాను పట్టించుకోనని అమర్‌దీప్ అన్నారు. ఇతరుల గురించి ఆలోచించి అనవసరంగా ఒత్తిడికి గురికాకూడదని, ప్రతిదానికీ కర్మ ఉంటుందని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తన అభిమాన బ్రాండ్ గురించి అడగగా, గతంలో ఏదో చెప్పినప్పటికీ, ఇప్పుడు అన్నీ మానేసి, జిమ్ చేసుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనం సాగిస్తున్నానని చెప్పారు. తనకు పార్టీలకు వెళ్లినా కేవలం నీళ్లు మాత్రమే తాగుతానని తెలిపారు. కెరీర్ గురించి తనకు భయాలు, ఆందోళనలు ఉన్నాయని అమర్‌దీప్ ఒప్పుకున్నారు. “నెక్స్ట్ ఏంట్రా అందరూ వెళ్ళిపోతున్నారు మనం ఇంకా వెళ్ళలేదే ఇక్కడే ఉన్నాం, ఎప్పుడు వస్తది ఎప్పుడు వస్తది” అనే బాధ ఎప్పుడూ ఉంటుందని, కానీ ఈ బాధే ముందుకు సాగడానికి ఇంధనంలా పనిచేస్తుందని వివరించారు. తనపై తనకు నమ్మకం ఉందని, అది అతివిశ్వాసం కాదని, టాలెంట్ ఉందని ఆయన అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

ఒక్కొక్క నగరంలో విల్లాలు, ఫ్లాట్‌లు ఉన్నాయన్న పుకార్లను అమర్‌దీప్ చౌదరి పూర్తిగా ఖండించారు. “అవన్నీ దొరికింటే బాగుండేది అసలు ఛా. ఎక్కడ ఉన్నాయి,” అని ఆయన నవ్వేశారు. తనకు విజయవాడలో విల్లా, రాజమండ్రిలో ఫ్లాట్ ఉన్నాయని వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో తనకు ఓన్ హౌస్ ఉందా అని అడగగా, అది తేజస్విని గత ఏడాది కొన్నదని వివరించారు. తన దగ్గర ఒక కారు మించి ఏమీ లేవని, నెలవారీ ఖర్చుల కోసం షోలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని తెలిపారు. బయటి ప్రపంచం అనుకునేంతలా తాను సంపాదించలేదని, కేవలం సస్టైన్ అవ్వడానికి కృషి చేస్తున్నానని ఆయన వివరించారు. చివరగా, తన స్నేహితుడు మానస్ అన్నకు ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా సందేశం పంపుతూ, “నువ్వు నా జీవితంలో బెస్ట్ ఫ్రెండ్. నా చివరి మాటల్లో అయినా, నేను చివరిగా ఉండేటప్పుడు అయినా సరే నిన్ను చూస్తూ ఉంటూ నువ్వు వచ్చినప్పుడు నేను పోయినా గాని నాకు హ్యాపీయే. అంతవరకు నువ్వు నాకు ఇష్టం, నువ్వు అంటే పిచ్చి నాకంతే,” అని తన గాఢమైన స్నేహాన్ని వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

అమర్ దీప్ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Follow Us