Bigg Boss Telugu 7: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన బిగ్ బాస్ బ్యూటీ శుభ శ్రీ..

ఇక మూడో రోజు బిగ్ హౌస్ లో బాగానే సందడి చేశారు కంటెస్టెంట్స్. బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ షో కూడా బాగానే ఉంది ఈసారి. హౌస్ లో ఉన్న ముద్దుగుమ్మలు ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. వీరిలో శుభ శ్రీ రాయగురు ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోవచ్చు. హౌస్ లోకి వస్తూనే స్టేజ్ పై నాకు తెలుగు రాదు.. తెలివి మాత్రం ఉంది అంటూ క్యూట్ గా మాట్లాడి ఆకట్టుకుంది. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది శుభ శ్రీ. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోనూ నటించానని తెలిపింది ఈ భామ.

Bigg Boss Telugu 7: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన బిగ్ బాస్ బ్యూటీ శుభ శ్రీ..
Subasri

Updated on: Sep 08, 2023 | 12:08 PM

బిగ్ బాస్ సీజన్ 7  లో ఉన్న 14 మంచిలో ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. ఇక హౌస్ లో ఎవరికీ వారు తమ గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక మూడో రోజు బిగ్ హౌస్ లో బాగానే సందడి చేశారు కంటెస్టెంట్స్. బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ షో కూడా బాగానే ఉంది ఈసారి. హౌస్ లో ఉన్న ముద్దుగుమ్మలు ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. వీరిలో శుభ శ్రీ రాయగురు ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోవచ్చు. హౌస్ లోకి వస్తూనే స్టేజ్ పై నాకు తెలుగు రాదు.. తెలివి మాత్రం ఉంది అంటూ క్యూట్ గా మాట్లాడి ఆకట్టుకుంది. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది శుభ శ్రీ. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోనూ నటించానని తెలిపింది ఈ భామ.

నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం.. ఆయనతో కలిసి నటించా. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ సినిమాలో నటించా.. సినిమా చాలా స్టైలిష్ గా ఎంటర్టైనర్ గా ఉంటుంది. ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా అని తెలిపింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో మూడో రోజు ‘ఫేస్ ద బీస్ట్’ అనే అనే గేమ్ ఇచ్చాడు బిగ్ బాస్.

ఇద్దరు బాడీ బిల్డర్స్ ను హౌస్ లోకి పంపించి కంటెస్టెంట్స్ ను వారితో పోటీపడమన్నారు. రింగ్ లో నుంచి బయటకు రాకుండా  ఉంటే ఐదు వారల ఇమ్యూనిటీ బూస్ట్ వస్తుందని తెలిపారు. దాంతో ఆ బాడీబిల్డర్స్ తో పోటీపడ్డారు. ఈ గేమ్ లో ఎవరు గెలవలేకపోయారు. ఆట సందీప్ , ప్రియాంక, శోభాశెట్టి, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ. రింగ్ లో ఎక్కువ సేపు ఉన్నారు. దాంతో ఆట సందీప్, ప్రియాంక జైన్ నెక్స్ట్ లెవల్ కు వెళ్లారు. ఈ ఇద్దరిలో విన్నర్ ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. ఈ టాస్క్ కంటే ముందు అందరు కలిసి తేజను ముస్తాబు చేశారు. బుగ్గమీద ఎవరైనా లిప్ స్టిక్ ముద్ర వేయండి అని అడిగాడు. దాంతో వెంటనే షకీలా అతడి బుగ్గ మీద ముద్దు పెట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.