దేత్తడి హారిక.. ! హైదరాబాద్ యాసలో మాట్లాడుతూ.. అందరికీ ఇచ్చిపడేసే వీడియోలతో నెట్టింట పాపులర్ అయిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ తో తన కంటూ హార్డ్ కోర్ ఫాలోవర్స్‌ను క్రియేట్ చేసుకున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అభితో.. షోలో ప్రేమాయణం నడిపించి ఆ సీజన్లో పాపులర్ కూడా అయ్యారు. కాని టాప్ 5కు చేరకుండానే మిడిల్ డ్రాప్ అయ్యారు. బయటికి వచ్చాక షరా మామూలుగానే తన షోలతో.. షార్ట్ ఫిల్మ్‌లతో.. సోషల్ మీడియా యాక్టివిటీతో బిజీ అయిపోయారు. ఇక ఆల్ ఆఫ్ సడెన్ గా.. పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోతున్నారనే న్యూస్ తో .. నెట్టింట వైరల్ అవుతున్నారు హారిక.
తనకు తెలిసిన.. పాపులర్ అయిన ఓ యూట్యూబర్ తో మూడు ముళ్లు వేయించుకుంటున్నారట ఈ బ్యూటీ. ఇప్పటికే ఆ బాయ్ తో పీకల్లోతు లవ్ లో ఉన్న ఈ బ్యూటీ.. లేట్ చేయకుండా.. సైలెంట్గా పెళ్లి చేసుకునేందుకు ఫిక్స్ అయ్యారట. తన ఫ్యామిలీని కూడా ఒప్పించి.. ముహుర్తాలు పెట్టించుకున్నారట. అయితే ఈ విషయం ఎలా బయటికి వచ్చిందో తెలియదు కాని.. ఎట్ ప్రజెంట్ సోషల్ మీడియాను మాత్రం విపరీతంగా షేక్ చేస్తోంది. మరి హారిక పెళ్లి విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.