ఖతమ్.. టాటా.. బైబై..! ఇక సర్దేసుకోవాల్సిందే.. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్ళేది అతనేనా..!!

బిగ్ బాస్ సీజన్ 9లో రచ్చ రచ్చ జరుగుతుంది. హౌస్ లో రెండు టీమ్స్ గా డివైడ్ అయ్యి టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్.. ఇక ఇప్పటికే హౌస్ లో రీతూ, కళ్యాణ్, దివ్యలను రాజు, రాణులుగా నియంనించాడు బిగ్ బాస్. అలాగే పవన్ , సంజన, నిఖిల్, సంజనను కమాండర్లు గా పెట్టాడు. మిగిలిన వారిని ప్రజలు అని చెప్పాడు.

ఖతమ్.. టాటా.. బైబై..! ఇక సర్దేసుకోవాల్సిందే.. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్ళేది అతనేనా..!!
Bigg Boss 9

Updated on: Nov 12, 2025 | 10:46 AM

బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరు ఎప్పుడు హౌస్ నుంచి బయటకు వచేస్తున్నారో అర్ధం కావడం లేదు.. కొంతమంది హౌస్ లో ఉండలేము అంటూ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. కొంతమంది మాత్రం అనారోగ్యంతో బయటకు వచ్చేస్తున్నారు. ఇక వారం వారం హౌస్ నుంచి ఒకొక్కరుగా హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇక ఇప్పటికే 9వారాలు పూర్తి చేసుకుంది బిగ్ బాస్ సీజన్ 9.. ఇక ఇప్పుడు పదో వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారు ఒకొక్కరూ ఎలిమినేట్ అవుతూ బయటకు వచ్చేశారు. గతవారం హౌస్ నుంచి రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. నేను హౌస్ లో ఉండలేకపోతున్నా.. మా పేరెంట్స్ గుర్తొస్తున్నారు అంటూ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు.

అలాగే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్ కూడా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. హౌస్ లో సాయి పెద్దగా యాక్టివ్ గా లేకపోవడంతో పాటు టాస్క్ ల్లోనూ పెద్దగా ఆడింది కనిపించలేదు. దాంతో నామినేషన్ లో సాయికి పెద్దగా ఓట్లు పడలేదు దాంతో అతను హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. ఇక ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటకు వస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వారం హౌస్ లో ఏకంగా పదిమంది నామినేట్ అయ్యారు. ఒక్క ఇమ్మాన్యుయేల్ తప్ప.

ఈవారం ఎవరు హౌస్ నుంచి బయటకు వస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా నామినేషన్స్ లో ఉన్న పదిమందిలో ఈవారం తక్కువ ఓట్లు నిఖిల్ కు పడుతున్నాయి. నిఖిల్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. కానీ మనోడు కూడా పెద్దగా హౌస్ లో కనిపించడం లేదు.. టాస్క్ ల్లోనూ పెద్దగా యాక్టివ్ గా లేడు నిఖిల్. దాంతో ఓట్లు కూడా పెద్దగా పడటం లేదు. ఇక ఈ వారం హౌస్ నుంచి నిఖిల్ బయటకు వచ్చేసేలా కనిపిస్తున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.