
అడియన్స్ ఎంతగానో ఎదురుచూసే సమయం వచ్చేసింది. శనివారం నాటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కోసం జనాలు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. వారం మొత్తం హౌస్మేట్స్ చేసిన పనులపై చిరాకు వచ్చిన అడియన్స్.. నాగార్జున వచ్చి ఎలాంటి గట్టిపెడతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో.. మమమాస్ అంటూ మాస్ అవతారంలో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. ఆరు పదుల వయసులోనూ చాలా సంవత్సరాలకు మాస్ లుక్ చూపిస్తూ జనాలను ఆకట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
మాస్ సినిమా పాటను మళ్లీ బిగ్ బాస్ స్టేజ్ పై మళ్లీ రిక్రియేట్ చేశారు. మాస్ ఈజ్ బ్యాక్.. మమమాస్ అంటూ భరణి అరిచి గోల చేశారు. ఇక స్టైలీష్ గా ఎంట్రీ ఇచ్చిన నాగ్.. ఆ తర్వాత ఒక్కొక్కరికి వాయింపు మొదలుపెట్టారు. ముందుగా తనూజతో మాట్లాడుతూ..బెడ్ టాస్కులో నువ్వు ఆడిన తీరు కరెక్టేనా.. వాళ్లు ఆడపిల్లలందర్నీ తోసేద్దాం అని అన్నారు. నువ్వు వాళ్లందరి తరుపున పోరాడి ఉండి ఉంటే.. చివరకు నీ వరకు వచ్చేది కాదు కదా అంటూ నిలదీశారు.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ముందే వెళ్లిపోయిన సంజన మీరంతా కలిసి ఆడండి.. విడివిడిగా ఆడొద్దని చెప్తూనే ఉంది.. అప్పుడైనా నీకు బుద్ది రావాలి కదా.. భరణి, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్.. ఈ ముగ్గురు నిన్ను తీయరు అని అనుకున్నావా.. ? అంటూ సీరియస్ అయ్యారు. ఆ తర్వాత దివ్యతో మాట్లాడుతూ.. శ్రీజ విషయంలో భరణి ప్రవర్తించిన తీరు కరెక్టేనా అని అడిగారు.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
ఇక చివరకు భరణికి క్లాస్ స్టార్ట్ చేశారు. ఎంతో ఎదగాల్సిన నువ్వు పడింది బెడ్ పై నుంచి కాదు..మా దృష్టిలో నుంచి కూడా కిందపడ్డావు. వారంలో తప్పులు చేసి వీకెండ్ లో ఒప్పుకుంటే కుదరదు.. నీకు స్పష్టంగా అర్థం కావడం కోసం.. జనం నీ గురించి ఏమనుకుంటున్నారో వాళ్లతోనే చెప్పిస్తా అంటూ ఓ అమ్మాయితో మాట్లాడించారు. ఆమె మాట్లాడుతూ.. భరణి గారు.. మీకు బాండింగ్స తప్ప ఆట కనిపించడం లేదు.. మిమ్మల్ని అసలు బిగ్ బాస్ ఉంచబుద్ది కావడం లేదు అంటూ చెప్పేసింది. ఇక ఈరోజు సాయంత్రం ఎపిసోడ్ లో మాత్రం ఒక్కొక్కరికి ఇచ్చిపడేసినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?