
బిగ్‌బాస్ సీజన్ 9లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ లా అడుగుపెట్టాడు భరణి. అప్పటికే సీరియల్స్, సినిమాల ద్వారా బయట మంచి పాపులారిటినీ సొంతం చేసుకున్న భరణి.. హౌస్ లోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత మూడు వారాలు తన ఆటతో అదరగొట్టాడు. కానీ తనూజ ఎప్పుడైతే నాన్న నాన్న అంటూ గేమ్ స్టార్ట్ చేసిందో అప్పుడే భరణి ఆట దారి తప్పింది. నెమ్మదిగా బంధాల మధ్యలో చిక్కుకున్నాడు. ఇక దివ్య ఎంట్రీ తర్వాత భరణి పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. అటూ తనూజ, ఇటు దివ్య మధ్య నలిగిపోయాడు. దీంతో అదే బంధాల విషయంతో ఎలిమినేట్ సైతం అయ్యాడు. అయితే జనాలు రెండో ఛాన్స్ ఇచ్చి మరోసారి భరణిని లోపలికి పంపించినప్పటికీ మరోసారి తనూజ, దివ్య మధ్య ఇరుక్కుపోయాడు భరణి. టాస్కులు, నామినేషన్స్.. ఇలా ప్రతి చిన్న విషయంలో భరణి కోసం కొట్టుకుంటున్నారు దివ్య, తనూజ. ఒకరితో మాట్లాడితో మరొకరు అలగడం.. చివరకు భరణి బుజ్జగించడం ఇదే పరిస్థితి.
ఇక నిన్నటి ఎపిసోడ్ లోనూ భరణి కోసం దివ్య, తనూజ మధ్య బీభత్సమైన వార్ జరిగింది. దీంతో వెక్కి వెక్కి ఏడ్చేసింది తనూజ. అసలేం జరిగిందంటే.. బిగ్‌బాస్ హౌస్‌కి కొత్త కెప్టెన్‌ని డిసైడ్ చేసేందుకు పెట్టిన టాస్కులో చివరిగా రీతూ, తనూజ, ఇమ్మూ మిగిలారు. ఆ సమయంలో కెప్టెన్ దివ్య డెసిషన్ తీసుకోవాల్సి రావడంతో ఆమె తనూజ పేరు చెప్పింది. ఇమ్మూ కెప్టెన్ కావాలంటే తనూజ ఉండకూడదంటూ రీజన్ చెప్పింది. అప్పటికే తనూజను తీయ్యొద్దంటూ కళ్యాణ్ సైతం చెప్పడంతో ఇమ్మూ కోసమే తనూజను తీసేస్తున్నానంటూ ఆన్సర్ ఇచ్చింది. దీంతో తనూజ సీరియస్ అయ్యింది. పర్సనల్ రీజన్స్ తీసుకువచ్చి కెప్టెన్సీ టాస్కులో నన్ను తీసేస్తావా..? అంటూ ప్రశ్నించింది. దివ్య నీ దగ్గరి నుంచి లాక్కోవడం నాకు పెద్ద మేటర్ కాదు.. కానీ నువ్వు తనూజను తీయనన్నావనే నీకు ఇచ్చాను అంటూ కళ్యాణ్ అనడంతో.. ఇక్కడ పర్సనల్ రీజన్ ఉంది అంటూ తనూజ చెప్పింది.
పర్సనల్ రీజన్ వల్లే నన్ను తీస్తుంది. నాకు నీతో మాట్లాడాలని లేదు..నీ పర్సనల్స్ హౌస్ బయట పెట్టుకో లోపల కాదు.. అడియన్స్ అన్నీ చూస్తున్నారు అంటూ తనూజ లోపలికి వెళ్లి పోయింది. ఆ తర్వాత తనూజను ఓదార్చేందుకు లోపలికి వెళ్తున్న భరణిపై ఫైర్ అయ్యింది దివ్య. విన్నారా భరణి గారు.. సంతోషమే కదా ఇప్పుడు అంటూ అరిచింది దివ్య. టాస్కు మధ్యలో పర్సనల్ రీజన్స్ నువ్వు తెస్తున్నావ్ అంటూ దివ్యతో అన్నాడు భరణి. ఇద్దరి మధ్య నేను వెళ్లట్లేదు అంటూ తనూజ ఏడుస్తుంటే భరణి వెళ్లి ఓదార్చాడు. నేను మీ గురించి బ్యాడ్ చెప్పానా.. మీకు బ్యాడ్ కోరుకున్నానా అంటూ తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. నేను మాట్లాడనులే నీతోటి ఇక అని భరణి అనడంతో.. నాతో ఎప్పుడూ మాట్లాడొద్దు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది తనూజ.
తర్వాత ఒంటరిగా కూర్చున్న భరణి వద్దకు వెళ్లి మాట్లాడేందుకు ట్రై చేసింది దివ్య. ఏం మాట్లాడతావ్ చెప్పు అంటూ అరిచాడు భరణి. అరిచినందుకు సారీ చెబుదామని వచ్చాను అని దివ్య అనడంతో ఫస్ట్ టైమా నువ్వు అరిచింది.. నువ్వు పాయింటి రెయిజ్ చేస్తావ్ తనేదో మాట్లాడతది.. నేనెందుకు స్టాండ్ తీసుకోవాలి దాంట్లో అంటూ భరణి సీరియస్ కావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. మొత్తానికి దివ్య, తనూజ మధ్యలో మరోసారి భరణి గేమ్ పై గట్టిగానే ఎఫెక్ట్ పడుతుంది. ఇక ఇంట్లో ఈ వారం కెప్టెన్ గా ఇమ్మూ గెలిచాడు.
ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..