
ఇన్నాళ్లు బిగ్ బాస్ హౌస్‌లో లేనిది ఇదే అన్నట్టుగా హౌస్ లోకి పాత కంటెస్టెంట్స్ ను పంపించారు. హౌస్ లో ఉన్నవారిలో చివరి వారం కెప్టెన్ అయ్యేందుకు అర్హత సాధించే వారికి చిత్ర విచిత్రమైన టాస్క్ లు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇందుకోసం గత సీజన్స్ లో పాల్గొన్న హౌస్ మేట్స్ ను మరోసారి హౌస్ లోకి పంపించి.. వారు హౌస్ లో ఉన్న ఒకరితో టాస్క్ ల్లో పార్టీ పడాలని చెప్పాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే గౌతమ్, మానస్, దేతడి హారిక, ప్రియాంక, ప్రేరణ హౌస్ లోకి వచ్చారు. ఇక ఇప్పుడు సోహెల్ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేశాడు. హౌస్ లోకి వచ్చిన సోహెల్ హౌస్‌లో సరికొత్త జోష్ నింపాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ప్రేరణ లోపలికి ఎంట్రీ ఇచ్చింది. ప్రేరణకు తనూజకు మధ్య టాస్క్ జరిగింది. క్రాస్ ఇట్ క్లైంబ్ ఇట్ రూల్ ఇట్ లో ఇద్దరూ పోటీపడ్డారు.
ఈ టాస్కులో ప్రేరణ ఇచ్చిపడేసింది.. దెబ్బకు తనూజ ఓడిపోక తప్పలేదు. దాంతో బిగ్ బాస్ ముద్దుబిడ్డకు కెప్టెన్ అయ్యే అవకాశం కోల్పోయింది. ఆతర్వాత దేత్తడి హారిక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ సుమన్ శెట్టితో పోటీపడింది. సుమన్ శెట్టి కష్టపడ్డప్పటికీ ఆయన ఓడిపోక తప్పలేదు. ఆతర్వాత సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ మానస్ హౌస్ లోకి వచ్చాడు.
మానస్ డీమన్ పవన్ తో పోటీపడ్డాడు.. ఇద్దరూ పోటా పోటీగా టాస్క్ లో పాల్గొన్నారు. కానీ చివరిలో పవన్ విన్ అయ్యాడు. ఇక ఇప్పుడు సోహెల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. హౌస్ లోకి వచ్చిన సోహెల్ తన దైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. హౌస్‌లోకి రావడంతోనే ఓ కొత్త జోష్ తీసుకొచ్చాడు. ” ఏంటీ మీకు ఆరు వారాల వరకూ చికెన్ పెట్టలేదంట.. నాన్ వెజ్ లేకుండా ఎలా ఉన్నారూ.. నాకు అర్థం కాదూ.. నేనైతే దూకి వెళ్లిపోయేవాడ్ని” అంటూ బిగ్ బాస్ ను బ్రతిమిలాడి.. పాలప్యాకెట్లు, చికెన్ , కాఫీ ప్యాకెట్ పంపించండి అంటూ కెమెరా ముందు రిక్వెస్ట్ చేశాడు. నా ఇజ్జత్‌కే సవాల్.. మీకు దండం పెడతాను.. వీళ్లకి రెండు పాల పేకెట్లు.. చికెన్.. కాఫీ పౌడర్ పంపించండి అంటూ రిక్వెస్ట్ చేసి నవ్వులు పూయించాడు. అలాగే బిగ్ బాస్ సోహెల్ అడిగినవి పంపించాడు. దాంతో హౌస్ మేట్స్ తో కలిసి డాన్స్ చేసి ఓ వైబ్ క్రియేట్ చేశాడు సోహెల్. ఇది కదా మాకు కావాల్సింది అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి