Bigg Boss Demon Pavan: నాన్న కోరిక తీర్చలేకపోయా.. అందుకే ఇప్పుడిలా.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన డీమాన్ పవన్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9తో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు డీమాన్ పవన్. బిగ్ బాస్ కప్పు కొట్టకపోయినా తన ఆట, మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. టాప్-3 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచి అందరి మన్ననలు అందుకున్నాడు.

Bigg Boss Demon Pavan: నాన్న కోరిక తీర్చలేకపోయా.. అందుకే ఇప్పుడిలా.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన డీమాన్ పవన్
Bigg Boss 9 Telugu Contestant Demon Pavan

Updated on: Mar 16, 2026 | 7:10 AM

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఫ్యామిలీలో ఇటీవల తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అతని తండ్రి దుర్గా ప్రసాద్ క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. దీంతో డీమాన్ పవన్ తో సహా అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పవన్ స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు, నెటిజన్లు అతనికి సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ఇక జబర్దస్త్ ఇమ్యాన్యుయేల్, రీతూ చౌదరి తదితర ప్రముఖులు పవన్ ఇంటికెళ్లి అతని తండ్రికి నివాళి అర్పించాడు. అలాగే పవన్ ను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే డీమాన్ పవన్ తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఒక వీడియో పెట్టాడు. లైఫ్‌ లో తొలిసారి విమానం ఎక్కుతున్నట్లు అందులో చెప్పుకొచ్చాడు. ‘ఇది నా జీవితంలో ఫస్ట్‌ ఫ్లైట్‌.. అమ్మానాన్నతో లేదా బెస్ట్‌ఫ్రెండ్స్‌తో లేదంటే ఏదైనా ముఖ్యమైన కారణముంటేనే విమానం ఎక్కాలనుకున్నాను. ఎందుకంటే అది నాకు జీవితాంతం గుర్తుండిపోవాలి అనుకున్నాను. దురదృష్టవశాత్తూ మా నాన్నతో నేనెప్పటికీ విమానం ఎక్కలేను. దేవుడు నాకిలా రాసిపెట్టాడేమో! మా నాన్న కోసం నేను తొలిసారి ఫ్లైట్‌ ఎక్కి కాశీ వెళ్లబోతున్నాను. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన జ్ఞాపకం’ అని పవన్‌ ఎమోషనల్ అయ్యాడు.ప్రస్తుతం డిమాన్ పవన్ షేర్ చేసిన ఈ ఎమోషనల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అగ్ని పరీక్షలో సత్తా చాటాడు డీమాన్ పవన్. బిగ్‌బాస్‌ తెలుగు తొమ్మిదో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు డీమాన్ పవన్. తన ఆట, మాట తీరుతో త్వరగానే బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. అయితే రీతూ చౌదరితో సాన్నిహిత్యంగా మెలగడం పవన్ కు కొంచెం నెగెటివిటీని తెచ్చిపెట్టింది. వీరి లవ్ ట్రాక్ ను కొందరు ఇష్టపడితే మరికొందరు అసహ్యించుకున్నారు. అయితే రీతూ ఎలిమినేట్ అయ్యాక మరింత ఎనర్జిటిక్ మారిపోయాడు పవన్. బిగ్ బాస్ గేమ్స్, టాస్కుల్లోనూ ఇరగ దీసి సీజన్ సెకెండ్ రన్నరప్ గా నిలిచాడు. ముఖ్యంగా ఫినాలేలో తెలివిగా రూ. 15 లక్షల క్యాష్‌ప్రైజ్‌ అందుకుని బయటకు వచ్చాడు. అయితే తన తండ్రి చికిత్స కోసమే బిగ్ బాస్ షోకు వచ్చానని, అందుకే ఈ రూ.15 లక్షల ప్రైజ్ మనీని తీసుకుంటున్నట్లు పవన్ చెప్పుకొచ్చాడు. అయితే అతని ఆశ నెరవేరలేదు. క్యాన్సర్ తో బాధపడుతోన్న పవన్ తండ్రి ఇటీవలే కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి

డీమాన్ పవన్ షేర్ చేసిన వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us