
బిగ్ బాస్ 9లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. హౌస్ లో బాండింగ్స్, ఏడుపులు, అరుపులు.. అబ్బో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. వారం వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. గత వారం హౌస్ నుంచి ఊహించని విధంగా మాధురి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే ఓట్లు తక్కువ పడటంతో ఆమె బయటకు వచ్చిందని అనుకుంటుంటే ఆమె మాత్రం నేను కావాలనే బయటకు వచ్చేశా అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారా అని అందరిలో ఆసక్తి మొదలైంది. అయితే ఈసారి హౌస్ నుంచి బయటకు వచ్చేది అతనే అని ఇన్ సైడ్ టాక్..
బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డు ద్వారా దివ్వెల మాధురి, రమ్య మోక్ష, నిఖిల్, గౌరవ్, సాయి శ్రీనివాస్, అయేషా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. వీరిలో ఇప్పటికే అయేషా, రమ్య మోక్ష, మాధురి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఇక ఇప్పుడు సాయి శ్రీనివాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే అవకాశాలు కనిపించనున్నాయి.
ఇప్పటికే ఓటింగ్ లో సాయి శ్రీనివాస్ వెనకబడి ఉన్నాడు. మనోడు హౌస్ లో కూడా పెద్దగా యాక్టివ్ గా కనిపించడంలేదు.. టాస్క్ ల విషయంలోనూ సాయి ఎక్కడగా కనిపించడం లేదు. దాంతో ఈసారి నామినేషన్స్ లో ఉన్న సాయి. ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓట్లు కూడా అతనికి తక్కువ వస్తున్నాయి. రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ ఓటింగ్ లో లాస్ట్ లో ఉన్నారు. ఓటింగ్ కు ఇంకా రెండు రోజులు ఉండటంతో ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి