Bigg Boss 8 : ఓర్నీ.. ఇది విగ్గా..! ఇంత ట్విస్ట్ ఇచ్చాడేంటీ.. అందరూ అవాక్ అయ్యారు

|

Sep 05, 2024 | 11:30 AM

నేను ఒంటరి వాడిని.. నాకష్టాలు ఇవి, నా బాధలు ఇవి అంటూ ఏదేదో చెప్తున్నాడు నిజమే అతని కష్టాలు, బాధలు వింటే నిజంగానే జాలేస్తుంది. కానీ ఎవరికి లేవు కష్టాలు. కానీ హౌస్ లోకి వచ్చింది ఇలా ఫ్లాష్ బ్యాక్‌లు, సెంటిమెంట్ స్టోరీస్ చెప్పడానికి కాదు కదా.. మనోడికి అది ఇంకా అర్ధం కాలేదు.

Bigg Boss 8 : ఓర్నీ.. ఇది విగ్గా..! ఇంత ట్విస్ట్ ఇచ్చాడేంటీ.. అందరూ అవాక్ అయ్యారు
Bigg Boss
Follow us on

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన 14మందిలో మణికంఠ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మొదటి రోజును నుంచి మనోడు సెంటిమెంట్ స్టోరీతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. మిగిలిన వారు మణికంఠ ఒక్కడే ఉంటున్నాడు. ఎవరితో కలవడం లేదు అని చెప్తే దానికి కూడా నేను ఒంటరి వాడిని.. నాకష్టాలు ఇవి, నా బాధలు ఇవి అంటూ ఏదేదో చెప్తున్నాడు నిజమే అతని కష్టాలు, బాధలు వింటే నిజంగానే జాలేస్తుంది. కానీ ఎవరికి లేవు కష్టాలు. కానీ హౌస్ లోకి వచ్చింది ఇలా ఫ్లాష్ బ్యాక్‌లు, సెంటిమెంట్ స్టోరీస్ చెప్పడానికి కాదు కదా.. మనోడికి అది ఇంకా అర్ధం కాలేదు. నిన్నటి నామినేషన్స్ లోనూ తన కష్టాలు చెప్పి అందరిని ఏడిపించాడు మణికంఠ.

నామినేషన్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన మణికంఠ మరోసారి ఏడవడం మొదలు పెట్టాడు. చూస్తూ సగం జీవితం అయిపోయింది.. మార్చుకోవాలన్నా మార్చుకోలేను అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన నిఖిల్, యష్మీ, సీత మణికంఠను ఓదార్చారు. అయినా మనోడు ఏడుపు ఆపలేదు. “నాకు దిక్కు లేదబ్బా.. నా వల్ల కావడం లేదు.. బాడీ నాకు సహకరించడం లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

బ్రెయిన్‌లో మిలియన్స్ ఆఫ్ థాట్స్ రన్ అవుతున్నాయి.. ఇక్కడి నుంచి బయటికి వెళ్లిన తర్వాత నా పై అందరూ నెగెటివ్ పర్సన్ అనే ట్యాగ్ వేస్తే.. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు.. బ్రెయిన్ పెట్టి ఆడు అంటున్నారు.. కానీ మొత్తం అంతా బయటికొచ్చేసింది. ఐయామ్ డన్ ఇంతకంటే ట్రాన్స్‌పరెంట్‌గా నేన ఉండలేను..అంటూ తల పై ఉన్న విగ్గు తీసి పక్కన పెట్టేశాడు. దాంతో అందరూ షాక్. ఏంటి ఇది విగ్గా..!! అని అవాక్ అయ్యారు. ఆతర్వాత మణికంఠను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచాడు బిగ్‌బాస్. ఏమైంది.? ఎందుకు ఏడుస్తున్నావ్.? అని బిగ్ బాస్ అడిగితే ” నా భార్య నాకు కావాలి.. నా అత్తమామల దగ్గర గౌరవం కావాలి.. నా స్టెప్ ఫాదర్ నాకు మళ్లీ కావాలి.. నా పిల్ల నాకు కావాలి.. నా మీద నాకు కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది..” అని మొదలు పెట్టాడు. బిగ్ బాస్ మణికంటకు దైర్యం చెప్పి “నువ్వు ఇక్కడి వరకూ వచ్చావంటే నువ్వు బలవంతుడివి కాబట్టే.. నీలో ఉన్న బలం నీకు తెలియాలంటే నువ్వు నిన్ను నమ్మాలి..” అని డైలాగ్ కొట్టి వెళ్లి ఆడుకో పో అని పంపించాడు. ఆతర్వాత మణికంఠ గురించి శేఖర్ బాషా మాట్లాడుతూ.. “ఇప్పడు మీరు యుద్ధానికి వెళ్లారు.. అవతలోడు బాణాలు వేస్తుంటే ఏయ్ నువ్వు వెయ్యడానికి లేదు నా ఫ్లాష్ బ్యాక్ ఇది అంటావా నువ్వు..”అని డైలాగ్ కొట్టాడు. ప్రేక్షకులకు కూడా అది నిజమే అనిపించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి