AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8: హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హరితేజ.. వెళ్తూ వెళ్తూ ఆ ఐదుగురి ముసుగు తీసేసింది

నిన్న ఆదివారం అవ్వడంతో హౌస్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసి బయటకు పంపించారు. ఇలా ఈసారి డబుల్ ఎలిమినేషన్ అయ్యింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో హరితేజ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.

Bigg Boss 8: హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హరితేజ.. వెళ్తూ వెళ్తూ ఆ ఐదుగురి ముసుగు తీసేసింది
Bigg Boss 8
Rajeev Rayala
|

Updated on: Nov 11, 2024 | 7:40 AM

Share

బిగ్ బాస్ సీజన్ 8లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అనారోగ్య సమస్యలతో గంగవ్వ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అలాగే నిన్న ఆదివారం అవ్వడంతో హౌస్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసి బయటకు పంపించారు. ఇలా ఈసారి డబుల్ ఎలిమినేషన్ అయ్యింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో హరితేజ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు నాగ్. చివరికి యష్మీ-హరితేజ.. వీరిలో హరితేజ ఎలిమినేట్ అయ్యింది. బయటకు వస్తూ.. హరితేజ తన రాయల్స్ క్లాన్ వాళ్లను హగ్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. మీ అందరిని మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యాయంది హరితేజ.

అలాగే విష్ణు ప్రియా కూడా హరితేజ బయటకు రాగానే విష్ణుప్రియ కూడా ఎమోషనల్ అయింది. అలాగే హరితేజాతో పాటు గేట్ వరకు వెళ్లిన నిఖిల్ నిన్ను చాలా మిస్ అవుతా అంటూ డైలాగ్ కొట్టాడు. దానికి నువ్వు నన్ను ముందు అనుమానించావ్ కదా అని అంది హరితేజ. ఆతర్వాత స్టేజ్ పైకి వచ్చిన హరితేజాకు తన జర్నీ చూపించారు నాగ్. తాజాగా జర్నీ చూసి ఆనందించింది హరితేజ. అలాగే ఆ జర్నీలో చివరిగా తన కూతురు వీడియో ప్లే చేశారు. దాంతో మరోసారి హరితేజ ఎమోషనల్ అయ్యింది.

మొత్తానికి పాప దగ్గరికే వెళ్తున్నావ్ కాబట్టి హ్యాపీ అనుకుంట అంటూ నాగ్ అన్నారు. అలాగే ఐదుగురు మాస్కులు తీసేయమని నాగార్జున అన్నారు. దానికి ముందుగా అవినాష్ మాస్క్ తీసేసింది హరితేజ. వ్విస్తూ మా మనసుల్ని గెలుచుకున్నావు.. కానీ నీ ఎమోషన్స్ ఏంటి.. కోపం ఏంటి ఆవేశం ఏంటి.. ఇవన్నీ కనిపించాలి. నువ్వు రియల్ గా ఆడాలి అని చెప్పింది. ఆతర్వాత రోహిణి మాస్క్ తీసేసింది. నువ్వు నీ ఒపినీయన్ బయటికొచ్చి చెప్పాలి.. ఎదో గుడ్డు లోపల ఉన్నట్టు ఉంటుంది సారి.  ప్రతి దానికి హౌస్‌లో ఏడవకు.. ఏది హార్ట్‌కి తీసుకోకు.. నువ్వు నవ్వితే బావుంటావ్.. ఏడవకు అని హరితేజ చెప్పింది. ఆతర్వాత తేజ పేరు చెప్పింది. ఇంకా బాగా ఆడు.. నీ పర్సనాలిటీ చూపించు అని తేజకు చెప్పింది. ఆతర్వాత ప్రేరణ గురించి చెప్పింది హరితేజ. కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నా నీలో కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి..నువ్వు ఇంకా బాగా ఆడాలి అని చెప్పింది. చివరిగా నిఖిల్.. నువ్వు ఇప్పటికైనా ఆ ముసుగు తీసెయ్.. నీ ఎమోషన్స్‌ను అలా దాచుకోకు.. ఎమెషన్స్ చూపించడం తప్పేం కాదు.. నీకు కోపం వచ్చినప్పుడు కోపపడు.. బాధ వచ్చినప్పుడు ఏడు అని చెప్పింది హరితేజ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్