Bigg Boss 8: తేజ నువ్వు సూపర్.. టాస్క్ ఓడిపోయినా కూడా అదరగొట్టేశాడు
హౌస్ లో వివిధ ప్లేస్ లో తాడు ముక్కలను పడేశారు. ఆ ముక్కలు సేకరించి వాటితో ఓ పెద్ద తాడు తయారు చేసి.. లక్కీ బాక్స్ కు కట్టి దాన్ని తన వైపు లాక్కోవాలి చెప్పాడు. దాంతో ఎవరు ముందుగా ఆ బాక్స్ ను తమ వైపు లాక్కుంటారో వల్లే విన్నర్ అని చెప్పాడు.
బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ లో కిచన్ టైమర్ ఆపేసి కంటెస్టెంట్స్ ను టెన్షన్ పెట్టాడు బిగ్ బాస్. కిచన్ టైం పెరగాలంటే అవినాష్, రోహిణి చిన్న పిల్లలుగా మారుతారు. వాళ్లు అడిగింది కాదనకుండా ఇవ్వాలి అప్పుడు కిచన్ టైం పెరుగుతుంది అని చెప్పుకొచ్చాడు. దాంతో అవినాష్, రోహిణి చిన్నపిల్లల గెటప్స్ వేసుకొని నవ్వులు పూయించారు. అవినాష్ లేడీ కంటెస్టెంట్స్ దగ్గరకు వెళ్లి ముద్దు కావలి, ఎత్తుకోవాలి అంటూ హడావిడి చేశాడు. ప్రేరణ, నయని, యష్మీ అవినాష్ ను ఎత్తుకున్నారు. దాంతో మరో రెండు గంటలు కిచన్ టైమర్ పెంచాడు బిగ్ బాస్. అలాగే అవినాష్, రోహిణికి ఐస్ క్రీమ్ లు పంచిపెట్టాడు బిగ్ బాస్. హౌస్ లో చివరి టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్.
చివరి ఛాలెంజ్ ‘తాడో పేడో’ అని చెప్పాడు. హౌస్ లో వివిధ ప్లేస్ లో తాడు ముక్కలను పడేశారు. ఆ ముక్కలు సేకరించి వాటితో ఓ పెద్ద తాడు తయారు చేసి.. లక్కీ బాక్స్ కు కట్టి దాన్ని తన వైపు లాక్కోవాలి చెప్పాడు. దాంతో ఎవరు ముందుగా ఆ బాక్స్ ను తమ వైపు లాక్కుంటారో వల్లే విన్నర్ అని చెప్పాడు. గెలిచిన వాళ్లు వాళ్ల టీమ్ లీడర్‌కి రెండు డైస్ రోల్ చేసే అవకాశంతో పాటు రెండు ఎల్లో కార్డ్స్ లభిస్తాయి అని చెప్పాడు.
ఈ గేమ్ లో తేజ, రోహిణి, నిఖిల్, గౌతమ్ పోటీ పడ్డారు. దాంతో నిఖిల్ ఈ గేమ్ లో విన్నర్ గా నిలిచాడు. రెండు ఎల్లో కార్డ్స్‌ను ఒకటి రెడ్ కి.. ఇంకొకటి గ్రీన్ టీమ్‌కి ఇచ్చేసింది బ్లూ టీమ్. ప్రేరణ, యష్మీ తాము తప్పుకోము అని చెప్పారు. గౌతమ్ తాము తప్పుకోము అని చెప్పారు. దాంతో గౌతమ్ కు తప్పలేదు. రేసు నుంచి తీసేయడంతో చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ కూడా కోల్పోయాడు గౌతమ్. అలాగే గ్రీన్ టీమ్ నుంచి విష్ణుప్రియ తప్పుకుంది. మెగా చీఫ్ కంటెండర్లుగా ఎంపికైన వారు హరితేజ, నిఖిల్, అవినాష్, నబీల్, ప్రేరణ, తేజ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. వీరికి తిరుగుతూనే ఉండు.. గెలిచే వరకూ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. షిప్ బ్యాగ్‌ను భుజాలపై మోస్తూ మీ బ్యాగ్‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది.. ప్రతి రౌండ్ లో ఎవరి బ్యాగ్స్ లో బాల్స్ తక్కువ ఉంటాయో వారు ఈ రేస్ నుంచి తప్పుకుంటారు అని చెప్పాడు బిగ్ బాస్. ఈ టాస్కుకి యష్మీ సంచాలక్. ముందుగా అందరూ బ్యాగులు వేసుకొని ఓ సర్కిల్ లో నిలబడ్డారు. వీరిలో మొదటి రౌండ్ లో హరితేజ అవుట్ అయ్యింది. ఆతర్వాత నిఖిల్-ప్రేరణ కలిసి తేజను టార్గెట్ చేశారు. తేజ తన బ్యాగ్ ను కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డాడు. కిందపడిన కూడా తేజ తన బ్యాగ్ ను కాపాడుకున్నాడు. కానీ అతను ఓడిపోయాడు. తేజ ఓడిపోయినా కూడా అతను ఆడిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత తేజ ఏడుస్తూ బాధపడటంతో గంగవ్వ ఓదార్చింది. కొంచెం స్టామినా ఉంటే బావుండేది ఇంకాసేపు అయినా ఆడేవాడిని.. ఎప్పుడూ ఇలానే చివరి వరకూ వచ్చి పోతున్నా” అంటూ బాధపడ్డాడు తేజ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.