బిగ్ బాస్ హౌస్ లోకి కొత్తవారు రావడంతో మరింత ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ హౌస్ లోకి ముందుగా 14 మందిని పంపించారు. ఆ 14 మందిలో ఐదుగురిని ఎలిమినేట్ చేసి బయటకు పంపించారు. అలాగే గౌతమ్ ను సీక్రెట్ రూమ్ లో ఉంచాడు బిగ్ బాస్. దాంతో పాటు గా హౌస్ లోకి మరో ఐదుగురిని పంపించారు. హౌస్ లోకి వెళ్లిన వారిలో నయని పావని, పూజ మూర్తి, అంబటి అర్జున్, అశ్విని, భోలే ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ కూడా మొదలయ్యాయి. కొత్తవాళ్లు, పాతవాళ్ళు అందరికి కలిపి నామినేషన్స్ పెట్టారు బిగ్ బాస్. అశ్విని శ్రీ, నయని పావని, పూజామూర్తి, యావర్, అమర్ దీప్, శోభాశెట్టి, టేస్టీ తేజా నామినేషన్స్ లో ఉన్నారు. ఈవారం వీరిలో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్తారు.
అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నామినేషన్స్ లో ఉన్న వారిలో యావర్, తేజ, శోభా శెట్టి, అమర్ దీప్ పాత కంటెస్టెంట్స్.. అశ్విని శ్రీ, నయని పావని, పూజామూర్తి, అంబటి అర్జున్ కూడా నామినేషన్స్ లు ఉన్నాడని తెలుస్తోంది.
నేటి ఎపిసోడ్ లో అంబటి అర్జున్ కూడా నామినేట్ కానున్నడని తెలుస్తోంది. కొత్తగా వచ్చిన వారిలో ఒకరు ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారని తెలుస్తోంది. మరి మీరు ఎవరనుకుంటున్నారా. అశ్విని శ్రీ, నయని పావని, పూజామూర్తి, అంబటి అర్జున్ ఎవరు హౌస్ నుంచి బయటకు వస్తారని మీరనుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఈ వారం ఎలిమినేట్ అయ్యే హౌస్ మెట్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరి వీరు కొత్తగా వచ్చిన వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకునున్నారో ఓటు వేయండి. డేంజర్ జోన్ లో ఉన్న హౌస్ మేట్స్ లో ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారని మీరనుకుంటున్నారో.. ఈ క్రింద టీవీ 9 ట్విట్టర్ లో తెలుపండి.
#BiggBossTelugu7 #Elimination #TV9TeluguPoll
ఈ వారం బిగ్ బాస్ కొత్త హౌస్ మేట్స్ లో ఎవరు డేంజర్ లో ఉన్నారు?— TV9 Telugu (@TV9Telugu) October 10, 2023
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..