Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో.. కన్నీళ్లుపెట్టుకున్న ప్రియాంక.. కారణం ఇదే

హౌస్ లోకి కొత్తగా ఐదుగురు హౌస్ మేట్స్ వచ్చారు. ఇక ఇప్పటికే హౌస్ లో ఉన్నవారిని రెండు టీమ్స్ గా డివైడ్ చేసి గేమ్స్ ఆడిస్తున్నారు. ఈ గేమ్స్ హోం రెండు టీమ్స్ మూడు పాయింట్స్ తో సమానంగా ఉన్నారు. ఇక నిన్నటి వరకు పోటుగాళ్ళు ముందంజలో ఉండగా నిన్నటి ఎపిసోడ్ లో ఆటగాళ్లు తమ సత్తా చూపించారు. నిన్న జరిగిన రెండు గేమ్స్ లో ఆటగాళ్లు విన్ అయ్యి స్కోర్స్ ను సమానం చేసుకున్నారు.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో.. కన్నీళ్లుపెట్టుకున్న ప్రియాంక.. కారణం ఇదే
Bigg Boss7

Updated on: Oct 13, 2023 | 11:59 AM

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటిలానే గొడవలు అరుపులతో పాటు ఏడుపులు కూడా కనిపిస్తున్నాయి. ఈ వారం కొత్త హౌస్ మేట్స్ రావడంతో.. హౌస్ లో సందడి డబుల్ అయ్యింది. హౌస్ లోకి కొత్తగా ఐదుగురు హౌస్ మేట్స్ వచ్చారు. ఇక ఇప్పటికే హౌస్ లో ఉన్నవారిని రెండు టీమ్స్ గా డివైడ్ చేసి గేమ్స్ ఆడిస్తున్నారు. ఈ గేమ్స్ హోం రెండు టీమ్స్ మూడు పాయింట్స్ తో సమానంగా ఉన్నారు. ఇక నిన్నటి వరకు పోటుగాళ్ళు ముందంజలో ఉండగా నిన్నటి ఎపిసోడ్ లో ఆటగాళ్లు తమ సత్తా చూపించారు. నిన్న జరిగిన రెండు గేమ్స్ లో ఆటగాళ్లు విన్ అయ్యి స్కోర్స్ ను సమానం చేసుకున్నారు. ఇక నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమో చాలా ఎమోషనల్ గా చూపించాడు.

బిగ్ బాస్ హౌస్ లో అంతో ఇంతో బెస్ట్ హౌస్ మేట్ అంటే ప్రియాంక అనే చెప్పాలి. హౌస్ లో ఉన్న వారికి వండి పెట్టడంలో ప్రియాంక ముందుంటుంది. బిగ్ బాస్ పవర్ అస్త్ర కోసం తన జుట్టు కూడా త్యాగం చేసింది ప్రియాంక. ఇక నేటి ఎపిసోడ్ లో  ప్రియాంక కన్నీళ్లు పెట్టుకోవడం చూపించారు .

కిచన్ లో రొటీన్ గూరించి యావర్ తో మాట్లాడింది ప్రియాంక. అయితే రొటీస్ యావర్ కు మాత్రమే ఎక్కువ ఇస్తుందని తనను మాటలు అంటారు అని యావర్ కు వివరించే ప్రయత్నం చేసింది ప్రియాంక.. అయినా కూడా యావర్ వినిపించుకోకుండా ప్రియాంకను ఎదో అన్నాడు. ఆతర్వాత కిచన్ లోకి వెళ్లి వంట చేస్తూ ఎమోషనల్ అయ్యింది ప్రియాంక. ఇక్కడ కర్రీ చాలా తక్కువ ఉంది అంటే వినరేంటి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు, నాకు బాధగా ఉంది. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మనం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాం.. మా ఇంటికి రండి కావాల్సినంత వండిపెడతాను అంటూ బాధపడింది. ప్రియాంకను గౌతమ్, సందీప్ ఓదార్చారు. పక్కన ఉన్న పూజా మూర్తి కూడా ప్రియాంకాను చూసి ఎమోషనల్ అయ్యింది.

బిగ్ బాస్ 7 ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

బిగ్ బాస్ 7 ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..