
బిగ్ బాస్ సీజన్ సీజన్ 7 లో రైతుబిడ్డ అనే సింపతీ కార్డు తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ . పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడంతో అందరు షాక్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ప్రశాంత్ లో చాలా మార్పులుకనిపిస్తున్నాయి. పల్లెటూరి నుంచి వచ్చాడు కసితో గేమ్ ఆడి ప్రేక్షకులను మెప్పిస్తాడు అనుకుంటే మనోడు. రతికా వెనక తిరుగుతూ ఆడియన్స్ ను నిరాశపరిచాడు. మొదటి రోజు నుంచి రతికా అందానికి ఫిదా అయిన ప్రశాంత్. ఆమె వెనక తిరుగుతూ.. ఆమె తో పులిహోర కలుపుతూ.. ప్రేక్షకులకు కాస్త చిరాకు తెప్పించాడు. రతికా మామూల్ది కాదు. మనోడిని తిప్పుకున్నని రోజులు తిప్పుకొని ఆతర్వాత దూరం పెట్టేసింది. నామినేషన్స్ లో వాదనల్లో ప్రశాంత్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. అతని వల్లే తన గేమ్ నాశనం అయ్యిందని కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. చివరకు ప్రశాంత్ అక్క అక్క అంటూ ఆమెను వేడుకునే వరకు వెళ్ళాడు.
రతిక ఎలిమినేట్ అవ్వడంతో ప్రశాంత్ తో పాటు ప్రేక్షకులు కూడా హమ్మయ్య అనుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి ప్రశాంత్ తన బుద్డిచుపించాడు. ఆదివారం ఎపిసోడ్ల్ లో కొంతమంది కొత్త కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించారు. హౌస్ లోకి వచ్చిన వారిలో హాట్ బ్యూటీ అశ్విని కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు అశ్వినితో పులిహోర కలుపుతూ రచ్చ చేస్తున్నాడు ప్రశాంత్.
నామినేషన్స్ సమయంలో శోభా శెట్టి అశ్విని మధ్య వాదనలు జరిగిన విషయం తెలిసిందే. దాంతో శోభా అరిచి గోల చేయడంతో అశ్విని బిత్తరపోయింది. దెబ్బకు ఏడుపు అందుకుంది. అయితే కెప్టెన్ అనే ట్యాగ్ తగిలించుకుని ఆమెను ఓదార్చుతూ రైతు బిడ్డ ప్రశాంత్ పులిహోర కలిపాడు. హౌస్ లో వాళ్లు వదిలిపెట్టిన కూడా.. మనోడు మాత్రం ఆమె పక్కనే కూర్చొని ఏడవకూడదు.. ఏం కాదు అంటూ కబుర్లు చెప్తూ కనిపించాడు. ఆతర్వాత ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడకి వెళ్లడం. ఎప్పుడు చూసిన ఆమె పక్కనే ఉంటూ ప్రేక్షకులకు మరోసారి ఏంట్రా బాబు ఇతను మళ్లీ మొదలు పెట్టాడు అని అనుకుంటున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ప్రశాంత్ కెప్టెన్ అన్న విషయం తాను మరిచిపోయాను అని పంచ్ కూడా వేశాడు బిగ్ బాస్.
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..