Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో కొత్త జంట.. గౌతమ్, శుభ శ్రీ మధ్య సంథింగ్ సంథింగ్

|

Oct 04, 2023 | 7:17 AM

ఈ సారి బిగ్ బాస్ సీజన్ 7లో ముందుగా రైతు బిడ్డ అంటూ హౌస్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ , రతిక మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ మొదట్లో చూపించారు. ఆతర్వాత ఇద్దరు గొడవలు పడటం.. రతిక మనోడిని గట్టిగానే వాడుకొని ఆడుకుంది అంటూ చూసిన ప్రేక్షకులు అనుకున్నారు. ఇక ఇప్పుడు హౌస్ లో మరో లవ్ స్టోరీ మొదలైంది. హౌస్ లో డాక్టర్ బాబు గౌతమ్, లాయర్ పాప శుభ శ్రీ మధ్య ఇప్పుడు ప్రేమ చిగురించింది. 

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో కొత్త జంట.. గౌతమ్, శుభ శ్రీ మధ్య సంథింగ్ సంథింగ్
Bigg Boss
Follow us on

బిగ్ బాస్ హౌస్ లో లవ్ స్టోరీలు కామనే హౌస్ లోకి వెళ్లిన వారు చాలా మంది ప్రేమలో పడ్డారు.  ఇప్పటికే బిగ్ బాస్ లో చాలా లవ్ ట్రాక్స్ చూపించారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 7లో కూడా ఓ లవ్ ట్రాక్ మొదలైందని తెలుస్తోంది. ఈ సారి బిగ్ బాస్ సీజన్ 7లో ముందుగా రైతు బిడ్డ అంటూ హౌస్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ , రతిక మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ మొదట్లో చూపించారు. ఆతర్వాత ఇద్దరు గొడవలు పడటం.. రతిక మనోడిని గట్టిగానే వాడుకొని ఆడుకుంది అంటూ చూసిన ప్రేక్షకులు అనుకున్నారు. ఇక ఇప్పుడు హౌస్ లో మరో లవ్ స్టోరీ మొదలైంది. హౌస్ లో డాక్టర్ బాబు గౌతమ్, లాయర్ పాప శుభ శ్రీ మధ్య ఇప్పుడు ప్రేమ చిగురించింది.

ఈ మధ్య గౌతమ్, శుభ శ్రీ క్లోజ్ గా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. నిన్నటి నుంచి కెమెరాలన్నీ ఈ ఇద్దరినీ ఫోకస్ చేస్తున్నాయి. మొదటి వారంలోనూ ఈ ఇద్దరూ మైక్ తీసేసి గుసగుసలు ఆడుకున్నారు. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోంది.

ఈ ఇద్దరు గుసగుసలు ఆడుకుంటూ చాలా సార్లు కనిపించారు. నిన్నటి ఎపిసోడ్ లో ఈ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.  నేను మాట్లాడితే నచ్చడం లేదా.. మెంటల్‌లా కనిపిస్తున్నానా.. అంటూ శుభ అడగటం దానికి గౌతమ్ నచ్చుతుంది కాబట్టే కదా లాయలిటీ ఉంది.. అందుకే నిన్ను భరిస్తున్నా అన్నాడు. దానికి శుభ శ్రీ తెగ సిగ్గుపడింది. ఇచ్చిన మాట మీద నిలబడటమే లాయలిటీ అంటూ క్లారిటీ ఇచ్చాడు. కంటెండర్‌గా నేను-ప్రిన్స్‌లో ఎవరు డిజర్వ్ అని అడిగితే నువ్వు ఎందుకు సెలక్ట్ చేయలేకపోయావ్ అంటూ గౌతమ్ అడిగాడు. ఆతర్వాత ఇద్దరూ సరదాగా మాట్లడుకుంటూ ఉండగానే గౌతమ్ శుభ కు ఓ హగ్ ఇచ్చాడు. ఆతర్వాత బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో కూడా ఈ ఇద్దరు పార్ట్నర్స్ గా ఉన్నారు. మొత్తానికి బిగ్ బాస్ సెవన్ లో ఓ లవ్ ట్రాక్ మొదలైంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.