
బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్ కోసం హౌస్ మేట్స్ పోటీపడుతున్నారు. నామినేషన్స్ పూర్తయిన వెంటనే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఇప్పటికే హౌస్ లో ఉన్న వారిని రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. యావర్, గౌతమ్, భోలే, తేజ, శోభా, రతిక లను వీరసింహాలుగా.. అర్జున్, ప్రశాంత్, శివాజీ, అమర్, ప్రియాంక, అశ్విని.. గర్జించే పులులుగా డివైడ్ చేశారు. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య ముందుగా హాల్ ఆఫ్ బాల్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఎక్కువ బాల్స్ ను తమ సంచిలో దాచుకోవాలని చెప్పాడు. ఆతర్వాత మధ్యలో గేమ్ ఆడించాడు. రెండు టీమ్స్ కు కలిసి బెలూన్ గేమ్ ఆడించాడు. ఈ గేమ్ లో వీరసింహాలు గెలిచారు. దాంతో వారికి ఒక పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ పవర్ ను వాడి అపోజిట్ టీమ్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలనీ చెప్పాడు. దాంతో వీరసింహాలు గర్జించే పులులు టీమ్ నుంచి ప్రశాంత్ ను అవుట్ చేశారు.
నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో హౌస్ మేట్స్ మధ్య రెండో గేమ్ జరిగిందని చూపించారు. బజార్ మోగగానే సస్టోర్ రూమ్ లో ఉన్న బ్యాగ్స్ పరిగెత్తుకుంటూ వెళ్లి తెచ్చుకోవాలి. అయితే అమర్ గౌతమ్ పరిగెత్తుకుంటూ వెళ్లినప్పటికీ అమర్ ముందుగా తన సంచులతో పాటు గౌతమ్ టీమ్ సంచులను కూడా తీసుకొని కింద పడేశాడు. దాంతో బయటకు రాగానే రతికా అమర్ తో వాదనకు దిగాడు.
దాంతో అమర్ రు రతికా పై రెచ్చి పోయాడు. పక్కలెక్కి ఆడుకోపోవమ్మా అన్నాడు అమర్. మాటలు మంచి మాట్లాడు అంటూ రతికా కుదాసీరియస్ అయ్యింది. అమర్ ఇది నా స్ట్రాటజీ అని అనడంతో ప్రతి ఏడవపని చేయడం స్ట్రాటజీ అనడం అని రతికా అనగానే నువ్వు చేసిన ఎదవ పని తెలిస్తే ఉమ్ముస్తారు బయట అని అన్నాడు అమర్. దాంతో జాగ్రతగా మాట్లాడు అంటూ వేలు చూపించి మాట్లాడింది రతికా.. అమర్ కూడా ఎక్కడా తగ్గకుండా ఆమెకు ఇచ్చిపడేశాడు. ఆతర్వాత గేమ్ మొదలైంది. ఈ గేమ్ లో అమర్ విన్ అయ్యాడు అని చూపించారు. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని ఈ ప్రోమో చూస్తే తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.