బిగ్ బాస్ సీజన్ 7 లో అసలైన ఆట మొదలైంది. హౌస్ లో ఉన్నవారిలో మూడో పవర్ అస్త్ర సాధించడానికి బిగ్ బాస్ ముగ్గురిని ఎపిక చేశారు.. శోభా శెట్టి, ప్రియాంక, యావర్ ను ఎపిక చేశాడు బిగ్ బాస్. అయితే నిన్నటి ఎపిసోడ్ లో యావర్ కు అన్యాయం జరిగింది. శోభా శెట్టి, ప్రియాంక , యావర్ ముగ్గురిలో ఎవరు పవర్ అస్త్రకు అనర్హులు అని మీరు అనుకుంటున్నారు. అనర్హులు అనుకున్నవారి ముందు ఉంచిన బామ్మను పగలకొట్టాలి అని ఓ చెత్త టాస్క్ ఇచ్చాడు. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉంటే ఆ ఇద్దరమ్మాయిలో ఈ అబ్బాయి పేరు చెప్పి అతడిని తప్పిస్తారని తెలిసి కూడా ఈ టాస్క్ఇచ్చాడు . దాంతో అనుకున్నట్టే శోభా, ప్రియాంక ప్రిన్స్ పేరు చెప్పారు. దాంతో మనోడు లబోదిబోమని ఏడ్చాడు. అన్ ఫెయిర్ అంటూ గుండెలు పగిలేలా ఏడ్చాడు యావర్ బాబు. ఆతర్వాత బిగ్ బాస్ ఇచ్చిన ఇచ్చిన టాస్క్ లో శోభా శెట్టి , ప్రియాంక పోటీపడ్డారు.
మూడో పవర్ అస్త్ర పొందడానికి ప్రియాంక, శోభా శెట్టి గట్టిగా పోటీపడ్డారు. ఇద్దరు అమ్మాయిలు కాబట్టి సింపుల్ గా బుల్ రైడ్ టాస్క్ ఇచ్చాడు. ఈ ఎద్దు బొమ్మపై ఎవరు ఎక్కువ సేపు ఉంటే వారే విన్నర్ అని. విన్ అయినా వారు మూడో పవర్ అస్త్రను చేసుకుంటారని, అలాగే ఈ పవర్ ఆస్ట్రాతో మూడు వారల ఇమ్యూనిటీ పొందుతారు అని తెలిపాడు.. దాంతో ఇద్దరు భామలు గట్టిగా పోటీపడ్డారు.
అయితే ఈ టాస్క్ ఓ ప్రియాంక జైన్ బుల్ ను పట్టుకొని ఎక్కువ సేపు ఆట ఆడింది. బుల్ తిరుగుతున్నా కూడా పట్టు వదలకుండా దాన్ని గట్టిగా పట్టుకొని చాలా సేపు ఆ ఎద్దు పై ఉంది. ఆతర్వాత రంగంలోకి వచ్చిన శోభా శెట్టి కూడా చాలా సేపు ఎద్దు పై ఉంది. ఇద్దరు ఈ టాస్క్ లో గట్టిగానే పోటీపడ్డారు. అయితే శోభా శెట్టి కంటే ప్రియాంక జైన్ ఎక్కువ సేపు బుల్ పై రైడ్ చేసింది. అయితే ప్రియాంక విన్నర్ అని అంతా అనుకునే సమయంలో ఎంబీగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ ఇద్దరిలో విన్నర్ ఎవరో ఈ రోజు ఎపిసోడ్ లో (శనివారం ) నాగార్జున ప్రకటిస్తారు అని తెలిపాడు బిగ్ బాస్. ప్రియాంకా.. అలాగే హౌస్ లో ఉన్నవారు షాక్ అయ్యారు. మరి నాగార్జున మూడో పవర్ అస్త్ర ఎవరు దక్కించుకున్నారో ఈ రోజు తెలుస్తోంది.
మరిన్ని బిగ్‌బాస్-7 కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి