Bigg Boss 7 Telugu: ఛీఛీ ఇదేం పని.. శుభశ్రీ మీద మీదకు వెళ్ళాడు శివాజీ.. దండం పెట్టేసిన సుబ్బు

|

Sep 28, 2023 | 9:03 AM

హౌస్ ను బ్యాంక్ గా మార్చారు. శివాజీ, సందీప్, శోభా శెట్టి బ్యాంకర్లు గా వ్యవహరించారు. అలాగే హౌస్ లో ఉన్నవారికి బ్యాంకర్లు కాయిన్స్ ఇవ్వాలని చెప్పారు. ఆ కాయిన్స్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించాడు. అలాగే బిగ్ బాస్ ఇచ్చే గేమ్స్ ను ఆడి కాయిన్స్ గెలుచుకోవాలి.. ఒకవేళ ఓడిపోతే కాయిన్స్ పోగొట్టుకుంటారు. అలాగే కాయిన్స్ ను లాకర్లలో దాచుకోవాలి అని సూచించాడు. అలాగే ఆ లాకర్లను బ్యాంకర్లు జాగ్రతగా చూసుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. దాంతో సందీప్, శోభా శెట్టి, శివాజీ కుర్చీలు వేసుకొని అక్కడ కూర్చున్నారు.

Bigg Boss 7 Telugu: ఛీఛీ ఇదేం పని.. శుభశ్రీ మీద మీదకు వెళ్ళాడు శివాజీ.. దండం పెట్టేసిన సుబ్బు
Bigg Boss7
Follow us on

బిగ్ బాస్ సీజన్ 7 లో రచ్చ నెక్స్ట్ లెవల్ కు వెళ్ళింది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్లు , హౌస్ లో ఉన్నవారి గొడవలతో రచ్చ రచ్చగా సాగుతోంది సీజన్ 7. ఇక నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ హౌస్ మేట్స్ గాయపడే వరకు వచ్చింది. హౌస్ ను బ్యాంక్ గా మార్చారు. శివాజీ, సందీప్, శోభా శెట్టి బ్యాంకర్లు గా వ్యవహరించారు. అలాగే హౌస్ లో ఉన్నవారికి బ్యాంకర్లు కాయిన్స్ ఇవ్వాలని చెప్పారు. ఆ కాయిన్స్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించాడు. అలాగే బిగ్ బాస్ ఇచ్చే గేమ్స్ ను ఆడి కాయిన్స్ గెలుచుకోవాలి.. ఒకవేళ ఓడిపోతే కాయిన్స్ పోగొట్టుకుంటారు. అలాగే కాయిన్స్ ను లాకర్లలో దాచుకోవాలి అని సూచించాడు. అలాగే ఆ లాకర్లను బ్యాంకర్లు జాగ్రతగా చూసుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. దాంతో సందీప్, శోభా శెట్టి, శివాజీ కుర్చీలు వేసుకొని అక్కడ కూర్చున్నారు. ఎవరెవరి దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయంటే.. తేజ – 51, గౌతమ్ – 24, ప్రియాంక – 41, అమరదీప్ – 41, రతిక – 35, యవర్ – 43, ప్రశాంత్ – 33, శుభశ్రీ – 31 కాయిన్స్ సాధించారు.

అయితే అక్కడ కాయిన్స్ కొట్టేయాలని శుభా శ్రీ ప్లాన్ వేసింది. దాంతో లాకర్లు దగ్గరకు.. వెళ్లాలని ట్రై చేసింది. దాంతో ఆమెను అడ్డకునే ప్రయత్నం చేశాడు శివాజీ. అయితే ఆమె శివాజీ చేస్తున్న పనికి ఇబ్బంది పడింది. శుభ శ్రీ మీదకు వెళ్తూ ఆమెను ఇబ్బంది పెట్టాడు. ఆమె దూరంగా జరగనుండి అని చెప్పినా కూడా శివాజీ వినిపించుకోకుండా ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశాడు.

ఆమె దూరంగా జరగండి అని అంటున్నా కూడా శివాజీ నేను నిన్ను ముట్టుకోలేదు కదా అంటూ కామెంట్స్ చేశాడు. అయితే భోజనం చేస్తున్న సమయంలో ఆమె తన బాధ అంతా బిగ్ బాస్ కెమెరాకు చెప్పుకుంది శుభ. బిడ్డ బిడ్డా అంటాడు పైపైకి రావడం కరెక్ట్ కాదు కదా బిగ్ బాస్ అంటూ చెప్పుకొచ్చింది. అమ్మాయి మీదకు వచ్చి ఎటాక్ చేయడం కరెక్ట్ కాదు. ఇది గేమ్ కాదు ఓవర్ యాక్షన్ అంటూ శివాజీ పై విమర్శలు చేశారు.

బిగ్ బాస్ ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.