Bigg Boss 6 Telugu: రేవంత్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన గీతూ.. దెబ్బకు ఏడ్చేశాడుగా..

|

Sep 14, 2022 | 3:17 PM

బుల్లితెర రియాలిటీ షోలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది బిగ్ బాస్.. అన్ని సీజన్స్ లానే సీజన్ 6లో కూడా గొడవలు,గోలలు, ఏడుపులుతో కావాల్సినంత ఎంటర్టైనమెంట్ దొరుకుతోంది.

Bigg Boss 6 Telugu: రేవంత్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన గీతూ.. దెబ్బకు ఏడ్చేశాడుగా..
Bigg Boss 6
Follow us on

Bigg Boss 6 Telugu: బుల్లితెర రియాలిటీ షోలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది బిగ్ బాస్.. అన్ని సీజన్స్ లానే సీజన్ 6లో కూడా గొడవలు,గోలలు, ఏడుపులుతో కావాల్సినంత ఎంటర్టైనమెంట్ దొరుకుతోంది. ఫస్ట్ వీక్ ఎవ్వరిని ఎలిమినేట్ చేయకుండా ట్విస్ట్ ఇచ్చారు కింగ్ నాగార్జున. ఇక ఈ వారం మాత్రం ఎవరోఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారు. ఆ ఒక్కరు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక నిన్నటి ఎపిసోడ్ మంచి రసవత్తరంగా సాగింది. ఈవారం కెప్టెన్సీ టాస్క్‌లో రేవంత్‌కి చుక్కలు చూపిస్తోంది గీతు. హౌస్ లో ఉన్నవాళ్లు ఒక్కొక్కరు ఒకొక్కరిని నామినేట్ చేయమన్నాడు బిగ్ బాస్. దాంతో అందరూ ఒకొక్కరిని నామినేట్ చేశారు. ఈ ప్రక్రియలో రేవంత్, గీతూకి మధ్య గట్టిగానే వార్ జరిగింది. అయితే రేవంత్ కాస్త రెచ్చిపోయి గీతూని అశుద్ధం తో పోల్చాడు. గీతూ కూడా రేవంత్ తో ధీటుగానే మాట్లాడింది.

ఇక కెప్టెన్సీ టాస్క్ లో గీతూ రేవంత్ ను చావుదెబ్బ కొట్టింది. టాస్క్ లో భాగంగా.. హౌస్ లో ఉన్న వాళ్లకు బొమ్మలు ఇచ్చాడు బిగ్ బాస్. ఆ బొమ్మలను తమ సొంత పిల్లలా చూసుకోవాలన్నాడు. సిసింద్రీ టాస్క్‌లో భాగంగా ఎవరికి ఇచ్చిన బొమ్మల్ని వాళ్లు కాపాడుకోవాలి. అయితే రేవంత్ ఆదమరిచి ఉన్న సమయంలో గీతూ రేవంత్ బొమ్మ కొట్టేసింది. దాంతో రేవంత్ టాస్క్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో రేవంత్ మరింత రెచ్చిపోయాడు. సంచలక్ గా ఉన్న నేహా పై గట్టిగా అరిచేశాడు. రేవంత్ భార్య ప్రస్తుతం గర్భవతి. బేబీ బొమ్మని కాపాడుకోలేకపోవడంతో బాగా ఎమోషనల్ అయ్యాడు రేవంత్. ఆ బొమ్మను పక్కన పెట్టుకొని పడుకుందాం అనుకున్నా.. ఆ ఫీల్ ఎలా ఉంటుందో చూడాలనుకున్నా.. కానీ కుదరలేదు. కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రేవంత్. మొత్తంగా గీతూ దొంగ దెబ్బ కొట్టడంతో రేవంత్ కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.