బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టారు. ప్రతి వారం అందరి ముందు నామినేట్ చేసే అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ ఈ సారి మాత్రం సీక్రెట్ నామినేషన్ ఇచ్చారు. రూమ్ లోకి పిలిచి ఎవరిని నామినేట్ చేస్తున్నారో కరెక్ట్ రీజన్స్ చెప్పాలని ఆదేశించాడు బిగ్ బాస్. ఇలా ఒకొక్కరు ఇద్దరు ఇంటి సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నామినేట్ చేసిన వల్ల ఫోటోలను మిషన్ లో పెట్టి ముక్కలు చేయాలి. అయితే ఈ నామినేషన్స్ లో భాగంగా ముందుగా రోహిత్.. శ్రీహాన్, ఫైమాలను నామినేట్ చేశాడు. శ్రీహాన్ ను ఎందుకు నామినేట్ చేస్తున్నాడో వివరిస్తూ.. టాస్క్‌లో మెరీనా విషయంలో గట్టిగా మాట్లాడినందుకు శ్రీహాన్‌ని నామినేట్ చేస్తున్నా అని అన్నాడు. అలాగే సంచాలక్‌గా ఫైమా సరిగ్గా చేయలేదనే కారణాలతో నామినేట్ చేశాడు. ఆ తర్వాత శ్రీ సత్య రాజ్, రోహిత్‌లను నామినేట్ చేసింది.
రాజ్ అయితే నామినేషన్స్‌లోకి రావడం లేదని అందుకు ఈవారం నామినేట్ చేస్తున్నానని.. అలాగే రీజన్లు ఏమీ లేవు కానీ రోహిత్‌ని నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది. దాంతో బిగ్ బాస్ సరైన రీజన్ చెప్పాలని ఆదేశించాడు . దాంతో రోహిత్ గతవారం అదుపుతప్పి అన్న ఒక మాటను తీసుకొని అదే రీజన్ గా చెప్పింది. రాజ్.. శ్రీహాన్‌ని, శ్రీ సత్యను నామినేట్ చేశాడు. శ్రీసత్యను నామినేట్ చేస్తూ.. చెక్ టాస్క్‌లో అమౌంట్ చెప్పొద్దని బిగ్ బాస్ చెప్పినా ఆమె శ్రీహాన్‌కి అమౌంట్ గురించి చెప్పింది అందుకే ఆమెను నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు.
కీర్తి.. శ్రీహాన్, శ్రీసత్యలను నామినేట్ చేసింది. ఫైమా.. ఇనయ, రోహిత్‌లను,శ్రీహాన్.. రోహిత్, ఆదిరెడ్డిలను,ఇనయ.. ఫైమా, రాజ్‌లను నామినేట్ చేసింది,ఆదిరెడ్డి.. ఇనయ, శ్రీహాన్‌ని నామినేట్ చేశాడు,రేవంత్.. ఫైమా,ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు. అందరికంటే ఎక్కువ నామినేషన్స్ శ్రీహాన్‌కి పడ్డాయి. శ్రీహాన్‌ని నాలుగు ఓట్లు.. ఫైమాకి మూడు ఓట్లు, రోహిత్‌కి మూడు ఓట్లు, రాజ‌్ కి రెండు ఓట్లు, ఇనయకి రెండు ఓట్లు, శ్రీసత్యకి రెండు ఓట్లు, ఆదిరెడ్డికి రెండు ఓట్లు పడ్డాయి.