Avinash Marriage: అవినాష్‌ ఎంగేజ్‌మెంట్‌పై అరియానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.. ఇంతకీ ఏమందంటే.

Avinash Marriage: జబర్దస్త్‌ కామెడీ షోతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు అవినాష్‌. ఈ పేరుకంటే ముక్కు అవినాష్‌గా ఎక్కువగా సుపరిచితుడు అయ్యాడు అవినాష్‌. జబర్దస్త్‌తో కొంత మందికే...

Avinash Marriage: అవినాష్‌ ఎంగేజ్‌మెంట్‌పై అరియానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.. ఇంతకీ ఏమందంటే.

Updated on: Sep 02, 2021 | 7:36 AM

Avinash Marriage: జబర్దస్త్‌ కామెడీ షోతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు అవినాష్‌. ఈ పేరుకంటే ముక్కు అవినాష్‌గా ఎక్కువగా సుపరిచితుడు అయ్యాడు అవినాష్‌. జబర్దస్త్‌తో కొంత మందికే పరిచయమైన అవినాష్‌.. బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో పాల్గొనడంతో మరింత క్రేజ్‌ పెరిగింది. బిగ్‌బాస్‌ హౌజ్‌లో తనదైన ఆటతీరు, కామెడీతో ఆకట్టుకున్న అవినాష్‌ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉన్న సమయంలో అవినాష్‌కు అరియానా ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు  నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. ఇక కొందరు గాసిప్‌ రాయుళ్లు అయితే ఏకంగా వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని వార్తలు సైతం వచ్చాయి. అయితే తాజాగా అవినాష్‌ నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలు నెట్టింట వైరల్‌ కావడంతో ఈ వార్తలకు బ్రేక్‌ పడినట్లు అయింది.

ఇదిలా ఉంటే అవినాశ్‌ వివాహంపై అరియానా ఎలా స్పందిస్తుందోనని అందరూ ఆలోచించారు. కానీ అరియానా మాత్రం కూల్‌గా స్పందించింది. అవినాశ్‌ వివాహంపై స్పందించిన అరియానా.. ‘మా మధ్య ఏదో ఉందని చాలా పుకార్లు ఉన్నాయి కానీ అలాంటిదేమీ లేదు. ఆయన నాకు మంచి స్నేహితుడు మాత్రమే. అవినాష్‌ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది అరియానా. దీంతో వీరిద్దరి మధ్య వస్తోన్న పుకార్లు చెక్‌ పడ్డట్లు అయ్యింది. ఇక తాను ఎప్పుడు వివాహం చేసుకోనుందన్నదానిపై అరియానా మాట్లాడుతూ.. బాగా డబ్బు సంపాదించి, సెటిల్‌ అయ్యాకే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. ఇదిలా ఉంటే అరియానా ఇటీవల సంచనల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొని రచ్చ చేసిన విషయం తెలిసిందే.

Also Read: Scrub Typhu: ఉత్తర భారతంలో కొత్త కలవరం.. చిన్నారులకు ప్రబలుతున్న వింత వ్యాధి.. యూపీలో 8మంది మృత్యువాత!

Pawan Kalyan Birthday: పవన్‌ కళ్యాణ్‌కు పవర్‌ స్టార్‌ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా.? ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

Andhra Pradesh: వారికి తెలియకుండానే అకౌంట్ల నుంచి మాయం అయిన నిధులు.. అసలేం జరుగుతోంది..